Updated : 08/12/2021 07:13 IST

Vikram Goud: ట్విస్ట్‌లే.. ట్విస్ట్‌లు

కిరణ్‌ రాజ్‌, దీపికా సింగ్‌ జంటగా పాశం నరసింహారావు తెరకెక్కిస్తున్న చిత్రం ‘విక్రమ్‌ గౌడ్‌’. సుహాసిని నిర్మాత. పోసాని కృష్ణమురళీ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాని తెలుగు, కన్నడ భాషల్లో ఏకకాలంలో రూపొందిస్తున్నారు. ఈ చిత్ర టీజర్‌ను ఇటీవల హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.. ‘‘ప్రేక్షకులు కోరుకునే అన్ని రకాల అంశాలు సినిమాలో ఉన్నాయి. ట్విస్ట్‌లు ఎక్కువగా ఉంటాయి. ప్రథమార్ధమంతా లవ్‌, ద్వితీయార్ధమంతా యాక్షన్‌ బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది. ఓ పాట మినహా చిత్రీకరణ పూర్తయింది. వచ్చే ఏడాది ప్రథమార్ధంలో సినిమా విడుదల చేస్తామ’’న్నారు. ఈ కార్యక్రమంలో ప్రతాని రామకృష్ణ గౌడ్‌, డి.ఎస్‌.రావు, ‘మంత్ర’ ఆనంద్‌ తదితరులు పాల్గొన్నారు.


Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్