Updated : 17 Nov 2021 12:09 IST

Vishal: నాకు సొంత ఇల్లు లేదు.. ఆ డబ్బునే పునీత్‌ కోసం వాడతా: విశాల్‌

బెంగళూరు: ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 16 సంవత్సరాలైనప్పటికీ తనకు సొంత ఇల్లు లేదని నటుడు విశాల్‌ అన్నారు. కర్ణాటక ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన పునీత్‌ సంస్మరణ సభలో దక్షిణాది సినీ పరిశ్రమకు చెందిన పలువురు నటీనటులు పాల్గొన్నారు. పునీత్‌తో తమకున్న అనుబంధాన్ని నెమరువేసుకొని.. ఆయన చేసిన మంచి పనులను గుర్తు చేసుకున్నారు. ఇందులో భాగంగా నటుడు విశాల్‌ మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు.

‘‘పునీత్‌ను తలచుకుంటే చిరునవ్వుతో కూడిన అతని ముఖం నా కళ్ల ముందే మెదులుతోంది. ఆయన మరణవార్త తెలియగానే కన్నీళ్లు ఆగలేదు. ఆ వార్తను జీర్ణించుకోవడానికి నాకు రెండు రోజులు సమయం పట్టింది. పునీత్‌తో నాకు అంత అనుబంధం లేదు. కానీ, ఆయనకు నేనూ ఒక అభిమానినే. పునీత్‌.. ఎన్నో మంచి కార్యక్రమాలు చేసేవాడని మరణించేవరకూ ఎవ్వరికీ తెలీదు. అలాంటి గొప్ప వ్యక్తి.. చేసిన సేవా కార్యక్రమాల్లో నేనూ భాగం కావాలనుకుంటున్నాను. అందులో భాగంగా పునీత్‌ చదివిస్తున్న 1800 మంది పిల్లలను ఇకపై నేను చదివిస్తాను. వాళ్ల చదువులకు అయ్యే ఖర్చు నేను భరిస్తాను. నిజం చెప్పాలంటే.. నాకు ఇప్పటివరకూ సొంత ఇల్లు లేదు. మా తల్లిదండ్రుల ఇంటిలోనే ఉంటున్నాను. నా సొంతింటి కలను నెరవేర్చుకోవడం కోసం ఇప్పటివరకూ డబ్బు కూడబెట్టుకున్నాను. ఆ డబ్బునే ఇప్పుడు పిల్లల చదువు కోసం ఖర్చు చేస్తాను. పునీత్‌ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను’’ అని విశాల్‌ అన్నారు.

అనంతరం మంచు మనోజ్‌ మాట్లాడుతూ పునీత్‌ తనకెంతో సన్నిహితుడని చెప్పారు. పునీత్‌ మరణవార్త తెలిసిన వెంటనే షాకయ్యానని.. వెంటనే బెంగళూరుకి వచ్చానని తెలిపారు. రాజ్‌కుమార్‌ కుటుంబసభ్యులకు తాను ఎప్పటికీ అండగా ఉంటానని అన్నారు. పునీత్‌కు పద్మశ్రీ అవార్డు వచ్చేలా అన్ని ఫిల్మ్‌ ఇండస్ట్రీ సభ్యులు కృషి చేయాలని కోరారు.

Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని