Vishal: సామాన్యుడు రాగాలాపన

విశాల్‌ హీరోగా నటిస్తూ.. స్వయంగా నిర్మిస్తున్న చిత్రం ‘సామాన్యుడు’. నాట్‌ ఏ కామన్‌ మ్యాన్‌.. అన్నది ఉపశీర్షిక. తు.ప. శరవణన్‌ తెరకెక్కిస్తున్నారు. డింపుల్‌ హయాతి కథానాయిక. యువన్‌ శంకర్‌ రాజా స్వరాలందిస్తున్నారు.

Updated : 23 Dec 2021 07:04 IST

విశాల్‌ హీరోగా నటిస్తూ.. స్వయంగా నిర్మిస్తున్న చిత్రం ‘సామాన్యుడు’. నాట్‌ ఏ కామన్‌ మ్యాన్‌.. అన్నది ఉపశీర్షిక. తు.ప. శరవణన్‌ తెరకెక్కిస్తున్నారు. డింపుల్‌ హయాతి కథానాయిక. యువన్‌ శంకర్‌ రాజా స్వరాలందిస్తున్నారు. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే బుధవారం ఈ చిత్ర థీమ్‌ మ్యూజిక్‌ను విడుదల చేశారు. స్ఫూర్తివంతమైన సాహిత్యంతో సాగుతున్న ఈ పాటను నివేదిత ఆలపించారు. ప్రచార చిత్రంలో విశాల్‌ ఫుల్‌ యక్షన్‌ మోడ్‌లో కనిపించారు. ‘‘ఆసక్తికరమైన యాక్షన్‌ డ్రామా కథాంశంతో రూపొందుతోన్న చిత్రమిది. విశాల్‌ నటన సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ సినిమాలో యోగిబాబు, రవీనా రవి, బాబురాజ్‌ జాకబ్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కెవిన్‌ రాజా ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని