Vishal: టీజర్‌తో వస్తున్న ‘సామాన్యుడు’

విశాల్‌ కథానాయకుడిగా నటిస్తూ.. స్వయంగా నిర్మిస్తున్న యాక్షన్‌సినిమా ‘సామాన్యుడు’. తు.ప.శరవణన్‌ దర్శకుడు. డింపుల్‌ హయాతి కథానాయిక. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాల్లో ఉన్న ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Updated : 24 Dec 2021 08:54 IST

విశాల్‌ కథానాయకుడిగా నటిస్తూ.. స్వయంగా నిర్మిస్తున్న యాక్షన్‌సినిమా ‘సామాన్యుడు’. తు.ప.శరవణన్‌ దర్శకుడు. డింపుల్‌ హయాతి కథానాయిక. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాల్లో ఉన్న ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ఈనెల 25న చిత్ర టీజర్‌ విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయాన్ని చిత్ర బృందం గురువారం సామాజిక మాధ్యమాల ద్వారా తెలియజేసింది. ‘‘విశాల్‌ నటిస్తున్న 31వ చిత్రమిది. విభిన్నమైన యాక్షన్‌ డ్రామా కథాంశంతో రూపొందుతోంది. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అని చిత్ర వర్గాలు తెలిపాయి. సంగీతం: యువన్‌ శంకర్‌ రాజా, ఛాయాగ్రహణం: కెవిన్‌ రాజా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని