Vishnu Priya: విష్ణుప్రియ ఉర్రూతలూగించే డ్యాన్స్‌.. ఆది కామెంట్‌!

డ్యాన్స్‌తో ఉర్రూతలూగించిన విష్ణుప్రియ. ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ కార్యక్రమంలో సందడి చేసింది.

Updated : 17 Aug 2022 10:29 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వ్యాఖ్యాతగా బుల్లితెర ప్రేక్షకుల్ని అలరించే విష్ణుప్రియ తనలోని డ్యాన్సర్‌ని పరిచయం చేసింది. ఈటీవీలో ప్రతి ఆదివారం ప్రసారమయ్యే ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ ఇందుకు వేదికైంది. ‘భామ భామ బంగారు’, ‘నన్ను కొట్టకురో తిట్టకురో’, ‘కుర్రాడు బాబోయ్‌’ పాటకి స్టెప్పులేసి ఉర్రూతలూగించింది. పాటకి తగ్గట్టు విష్ణుప్రియ ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్‌ చూస్తే వావ్‌ అనాల్సిందే. అందుకే షోలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆమె డ్యాన్స్‌కి ఫిదా అయ్యారు. తమని తాము మరిచిపోయేలా ఎంజాయ్ చేశారు. ‘నాకు నిద్రరాకుండా ఏదైనా చేయమంటే నిద్రలేకుండా చేసింది’ అని ఆది తనదైన శైలిలో కితాబిచ్చాడు. ఈ ఎపిసోడ్‌ సెప్టెంబరు 26న ప్రసారమై టీవీల్లో సందడి చేయగా ప్రస్తుతం నెట్టింట వినోదం పంచుతోంది. ఇప్పటి వరకూ మీరు ఈ డ్యాన్స్‌ పెర్‌ఫార్మెన్స్‌ చూడకపోతే ఇప్పుడు చూసేయండి..


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని