Paagal: సినిమా చూశాకే అలా మాట్లాడా: విశ్వక్ సేన్
‘నేనెప్పుడూ సినిమా తొలికాపీనీ చూశాకే ముందస్తు విడుదల వేడుకలో మాట్లాడతా’ అని యువ నటుడు విశ్వక్ సేన్ అన్నారు. ప్రేమికుడిగా ఆయన నటించిన చిత్రం ‘పాగల్’. నివేదా పేతురాజ్ నాయిక. నరేశ్ కొప్పిలి దర్శకుడు.
ఇంటర్నెట్ డెస్క్: ‘నేనెప్పుడూ సినిమా తొలికాపీని చూశాకే ముందస్తు విడుదల వేడుకలో మాట్లాడతా’ అని యువ నటుడు విశ్వక్ సేన్ అన్నారు. ప్రేమికుడిగా ఆయన నటించిన చిత్రం ‘పాగల్’. నివేదా పేతురాజ్ నాయిక. నరేశ్ కొప్పిలి దర్శకుడు. ఈ సినిమా ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే మీడియాతో ముచ్చటించాడు విశ్వక్. ప్రీ రిలీజ్ ఈవెంట్లో అలా ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? ‘పాగల్’ సంగతేంటి? తదితర విషయాలు పంచుకున్నాడు.
ముందస్తు విడుదల వేడుక (ప్రీ రిలీజ్ ఈవెంట్)లో మీరు మాట్లాడిన విషయాలపై సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయి. దీనిపై ఏమంటారు?
విశ్వక్: నేను నా సినిమా తొలి కాపీ చూసి, ఆ మాటలు అన్నాను. అప్పుడు మాట్లాడిన ఏ మాటనీ నేను వెనక్కి తీసుకోవాలనుకోవట్లేదు. ఇప్పుడే కాదు ఎప్పుడూ సినిమా చూశాకే ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడతా. సినిమాకి ఎక్కువ, సినిమాకి తక్కువ కాకుండా ఉన్నది ఉన్నట్టు మాట్లాడతా. నేనే కాదు నా మిత్రులు, దర్శకుడి స్నేహితులు నిన్న సినిమా చూసి ‘అన్నా.. నువ్వు పేరు మార్చుకునే పనిలేదు’ అని అన్నారు.
ఈ సినిమా ప్రచారానికి బాగా కష్టపడుతున్నట్టున్నారు..
విశ్వక్: తప్పదు కదండి. నాకంటూ ఎవరీ సపోర్ట్ లేదు. చాలాకష్టపడి తీసిన సినిమా. నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరం కథకి కనెక్ట్ అయి ఈ సినిమా చేస్తాం. చూసిన ప్రతి ఒక్కరినీ ఈ చిత్రం కదిలిస్తుందనే నమ్మకంతో ఉన్నాం.
మీ గత చిత్రాలతో పోలిస్తే ఇందులో ఎమోషన్ తగ్గినట్టు అనిపిస్తుంది?
విశ్వక్: అలాంటిదేమీ లేదు. ఈ చిత్రంలోనూ భావోద్వేగ సన్నివేశాలున్నాయి. ట్రైలర్లో చివరి 30 సెకన్లపాటు ఎమోషన్ ఎలా ఉందో సినిమాలో ఆఖరి 30 నిమిషాలు అలానే ఉంటుంది. ప్రతి ఒక్కరూ అందులో లీనమవుతారు. ట్రైలర్ చూసిన చాలామంది ‘ఎమోషన్ సీన్లలో బాగా నటించావు’ అని నాకు సందేశాలు పంపుతున్నారు.
ఈ సినిమాలో మదర్ సెంటిసెంట్ గురించి..
విశ్వక్: ప్రారంభమైన ఐదు నిమిషాల్లోనే సినిమా ఎలా ఉండబోతుందో మీకు అర్థమవుతుంది. తల్లీకొడుకుల మధ్య అనుబంధాన్ని చాలా చక్కగా చూపించాం. ‘నిజాయతీగా మనం ఎవర్నీ ప్రేమించినా వాళ్లు తిరిగి మనల్ని ప్రేమిస్తారు’ అని ఈ సినిమాలోని అమ్మపాత్ర చెబుతుంది. చనిపోయిన ఆ తల్లిప్రేమను మరొకరిలో వెతికే ప్రయత్నమే కథాంశం. సినిమా చూశాక, ఇంటికెళ్లి ఈ పాత్రల గురించి మాట్లాడకుండా ఉండలేరు.
కథకి, టైటిల్‌కి న్యాయం చేకూర్చినట్టేనా?
విశ్వక్: ప్రేమ గురించి చెప్పే ఒక గొప్ప కథ ఇది. అమ్మను పిచ్చిగా ప్రేమించే కొడుకు కథ. అమ్మ ప్రేమ తిరిగి దొరుకుతుందా, లేదా? ఈ అంశాలతో ముడిపడిన ఈ సినిమాకి ‘పాగల్’ టైటిల్ సరిగ్గా సరిపోతుంది.
తదుపరి ప్రాజెక్టులు ఏం చేస్తున్నారు?
విశ్వక్: పీవీపీ, దిల్‌రాజు కాంబినేషన్లో ఓ చిత్రం చేస్తున్నా. 70శాతం పూర్తయింది. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతోంది. ‘అశోకవనంలో అర్జున కల్యాణం’ అనే మరో సినిమాలో నటిస్తున్నా.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
2014 రోజులు గుర్తొస్తున్నాయి... జయం మనదే
‘‘మంచి ఉద్దేశంతో సినిమా తీస్తే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. వాళ్ల ఆదరణ ఒక బాధ్యతగా భావిస్తా. సమాజం పట్ల స్పృహతో, రాజకీయంగానూ చైతన్యం కలిగించాలనే ఆలోచనతోనే కథాంశాల్ని ఎంచుకుంటా. 2014లో ఎన్నికలకు ముందు ‘లెజెండ్’ విడుదలైంది. -
టిల్లు నవ్వడు.. నవ్వేలా చేస్తాడు!
‘డీజే టిల్లు’ చిత్రంతో సినీప్రియుల మదిపై చెరగని ముద్ర వేశారు సిద్ధు జొన్నలగడ్డ. ఆ పాత్రతో తెరపై ఆయన చేసిన అల్లరి అందర్నీ కడుపుబ్బా నవ్వించింది. దీంతో ఇప్పుడదే టిల్లు పాత్రతో మరోసారి అలరించేందుకు ‘టిల్లు స్క్వేర్’ సినిమాతో సిద్ధమయ్యారు సిద్ధు. -
కొన్నేళ్లపాటు గుర్తుపెట్టుకునేలా... ఫ్యామిలీస్టార్
తన కుటుంబాన్ని పైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించే ప్రతి వ్యక్తి ఫ్యామిలీస్టార్ అని చెప్పడమే ఈ సినిమా కథాంశం అన్నారు దిల్‌రాజు. ఆయన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరీష్‌తో కలిసి నిర్మించిన చిత్రం ‘ఫ్యామిలీస్టార్’. -
చివరి తరంలో స్టార్స్ మేమే
‘‘చిత్రపరిశ్రమలో హిట్స్ మాత్రమే అందుకున్న నటీనటులు ఎవరు లేరు. ప్రతి ఒక్కరూ వారి కెరీర్లో హిట్ ఫ్లాప్‌ల రుచి చూశాకే విజయబాటలో నడుస్తార’’ని అంటోంది బాలీవుడ్ నాయిక కంగనా రనౌత్. -
హీరామండీ తారల మెరుపులు అప్పుడే
భారతీయ సినిమా స్థాయిని పెంచిన దర్శకుల్లో సంజయ్ లీలా భన్సాలీ ఒకరు. ప్రతి చిత్రాన్ని ఎంతో క్లాసిక్‌గా తీర్చిదిద్దడం ఈయన స్టైల్. త్వరలో తన కలల ప్రాజెక్టు ‘హీరామండీ: -
పేరు... ఆ రోజు
రజనీకాంత్ కథానాయకుడిగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. రజనీకి ఇది 171వ చిత్రం. సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. -
చరిత్రను మార్చిన సంఘటన
బాలీవుడ్ కథానాయకుడు విక్రాంత్ మాస్సే, రాశీ ఖన్నా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ది సబర్మతీ రిపోర్ట్’. రంజన్ చందేల్ తెరకెక్కిస్తున్నారు. -
సూర్య 44వ చిత్రం ఖరారు
ప్రేక్షకుల్ని... అభిమానుల్ని ఆశ్చర్య పరుస్తూ తన కొత్త సినిమాని ప్రకటించారు సూర్య. ఎవరూ ఊహించని రీతిలో కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నట్టు ప్రకటించారు. అసలేమాత్రం ప్రచారంలోకి రాని కలయిక ఇది. -
తగ్గేదేలే..
దుబాయిలోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో గురువారం తన మైనపు విగ్రహం వద్ద అల్లు అర్జున్ -
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
‘అఖండ 2’లో బాలకృష్ణ లుక్స్ ‘అఖండ’కు మించి ఉంటాయని రామ్స్ అన్నారు. తాను హీరోగా నటించిన ‘ఫైటర్ రాజా’ టీజర్ లాంచ్ ఈవెంట్లో ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు. -
అల్లు అర్జున్‌కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
హీరోగా తన తొలి సినిమా విడుదలైన రోజే అల్లు అర్జున్‌కు అరుదైన గౌరవం దక్కింది. అదేంటంటే? -
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్‌కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్