Vishwaksen: నేను చెప్పింది తప్పైతే పేరు మార్చుకుంటా: విశ్వక్‌సేన్‌

వరుస మాస్‌ చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరించిన నటుడు విశ్వక్‌సేన్‌ మొదటిసారి ప్రేమికుడిగా మెప్పించనున్నారు. ఆయన లవర్‌బాయ్‌ పాత్రలో నటిస్తున్న చిత్రం ‘పాగల్‌’. నరేశ్‌ కొప్పిలి దర్శకుడు. ఆగస్టు 13న ఈ సినిమా....

Updated : 12 Aug 2021 14:07 IST

ప్రచారంలో ప్రామిస్‌ చేసిన హీరో

హైదరాబాద్‌: వరుస మాస్‌ చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరించిన నటుడు విశ్వక్‌సేన్‌ మొదటిసారి ప్రేమికుడిగా మెప్పించనున్నారు. ఆయన లవర్‌బాయ్‌ పాత్రలో నటిస్తున్న చిత్రం ‘పాగల్‌’. నరేశ్‌ కొప్పిలి దర్శకుడు. ఆగస్టు 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ‘పాగల్‌’ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ సినీ ప్రియుల సమక్షంలో హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో విశ్వక్‌ మాట్లాడుతూ.. ‘పాగల్‌’ సూపర్‌ హిట్‌ అవుతుందన్నారు. కరోనా కారణంగా మూతపడిన థియేటర్లను ‘పాగల్‌’తో ఓపెన్‌ అయ్యేలా చేస్తానని చెప్పారు.

‘‘పాగల్‌’ బ్లాక్‌బస్టర్‌ విజయాన్ని సొంతం చేసుకుంటుంది. ఇప్పుడే సినిమా ఫైనల్‌ కాపీ చూశాను. బొమ్మ అదిరిపోయింది. వేరే సినిమా షూట్స్‌లో బిజీగా ఉన్నప్పుడు నరేశ్‌ ఓ సారి నన్ను కలిసి.. ‘పాగల్‌’ కథ చెప్పాడు. ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని నాకు అప్పుడే అనిపించింది. కథ విన్న వెంటనే ఓకే చేసేశాను. నా టీమ్‌ మొత్తానికి ధన్యవాదాలు. అందరూ అద్భుతంగా వర్క్‌ చేశారు. దిల్‌రాజు డబ్బుల విషయంలో వెనకాడలేదు. మాకు అండగా ఉన్నారు. ఇప్పటివరకూ ప్రతి ఇంటర్వ్యూలోనూ నేను ఇలియానా ఫ్యాన్‌ అని చెప్పుకున్నాను. కానీ ఈ సినిమా తర్వాత నేను నివేదా పేతురాజ్‌ అభిమానినయ్యాను. నమ్మండి.. మీరు కూడా ఆమెకు ఫ్యాన్స్‌ అవుతారు. శనివారం నాడు పబ్బులు, బార్లలోనే కాదు నా సినిమా ఆడే థియేటర్లలో కూడా పార్టీలు జరుగుతాయి. పరిస్థితులు ఇంకా చక్కబడలేదు.. థియేటర్లు పూర్తిగా ఓపెన్‌ చేయలేదు.. ఇప్పుడు ఎందుకు ‘పాగల్‌’ రిలీజ్‌ చేస్తున్నారని అందరూ నన్ను అడుగుతున్నారు. వాళ్లకు నేను చెప్పేది ఒక్కటే.. ‘సర్కస్‌లో సింహంతో ఎవరైనా ఆడుకుంటారు. నేను అడవికొచ్చి ఆడుకునే టైప్‌. ఈ సినిమాతో మూసుకున్న థియేటర్లు కూడా ఓపెన్‌ అయ్యేలా చేయిస్తా. గుర్తుపెట్టుకోండి. మామూలుగా ఉండదు సినిమా. నా పేరు విశ్వక్‌ సేన్‌.. నేను చెప్పింది తప్పైతే పేరు మార్చుకుంటా!’ అని విశ్వక్‌సేన్‌ అన్నారు.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని