Vivaha Bhojanambu: నవ్విస్తోన్న ‘వివాహ భోజనంబు’ ట్రైలర్‌

హాస్య నటుడు సత్య హీరోగా రామ్‌ అబ్బరాజు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘వివాహ భోజనంబు’. అర్జావీ రాజ్‌ కథానాయిక. యువ నటుడు సందీప్‌ కిషన్‌ స్వీయ నిర్మాణంలో కీలక పాత్ర పోషించాడు.

Published : 04 Aug 2021 19:02 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: హాస్య నటుడు సత్య హీరోగా రామ్‌ అబ్బరాజు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘వివాహ భోజనంబు’. అర్జావీ రాజ్‌ కథానాయిక. యువ నటుడు సందీప్‌ కిషన్‌ కీలక పాత్ర పోషించాడు. ఈ చిత్రం త్వరలోనే కొత్త ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ నేపథ్యంలో ట్రైలర్‌ విడుదలైంది. లాక్‌డౌన్‌ ఇతివృత్తంగా సాగే సన్నివేశాలతో ఆద్యంతం నవ్విస్తోంది ఈ ప్రచార చిత్రం. ఇందులో హీరో పిసినారిగా కనిపించాడు. అతని వివాహం అనంతరం ప్రభుత్వం సంపూర్ణ లాక్‌డౌన్‌ ప్రకటిస్తుంది. పెళ్లికి విచ్చేసిన బంధువులంతా హీరో ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితి నెలకొంటుంది. వాళ్లని కంట్రోల్‌ చేసే క్రమంలో హీరో సత్య నవ్వులు పూయించాడు. అది ఎక్కువగా వాడొద్దు.. ఇది అంత ఎందుకు అంటూ తన హావభావాలతో ఆకట్టుకుంటున్నాడు. మరి సత్య ఆ ఖర్చంతా ఎలా భరించాడు? వాళ్లని ఎప్పుడు తమ ఇంటికి పంపించాడు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఆనంది ఆర్ట్స్‌, సోల్జర్స్‌ ఫ్యాక్టరీ సంస్థలు నిర్మించిన ఈ చిత్రాన్ని వెంకటాద్రి టాకీస్‌ సంస్థ సమర్పించింది. ఈ చిత్రంలో సుదర్శన్‌, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, వైవా హర్ష, శివన్నారాయణ, టీఎన్‌ఆర్‌ తదతరులు నటించారు. అనివీ సంగీతం అందించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని