MAA Elections: ప్రకాశ్‌రాజ్‌ ప్యానెల్‌ సభ్యుల రాజీనామా.. లేఖలు అందలేదు: మంచు విష్ణు

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ‘మా’ ఎన్నికల్లో విజయం సాధించినప్పటికీ తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ఇటీవల ప్రకాశ్‌రాజ్‌ ప్యానెల్‌ సభ్యులు తెలిపిన విషయం తెలిసిందే. ఆ ప్యానెల్‌  సభ్యుల...

Updated : 18 Oct 2021 12:53 IST

హైదరాబాద్‌: మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ‘మా’ ఎన్నికల్లో విజయం సాధించినప్పటికీ తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ఇటీవల ప్రకాశ్‌రాజ్‌ ప్యానెల్‌ సభ్యులు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ‘మా’ నూతన అధ్యక్షుడు మంచు విష్ణు దీనిపై స్పందించారు. తన తండ్రి మోహన్‌బాబు, ప్యానెల్‌ సభ్యులతో కలిసి ఆయన సోమవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

‘‘మా’ ఎన్నికల్లో విజయం సాధించి.. అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించడం ఎంతో ఆనందంగా ఉంది. ఎన్నికల్లో నా ప్యానెల్‌ ఎంతో కష్టపడింది. స్వామి వారి ఆశీస్సులు తీసుకోవడానికి ఇక్కడికి వచ్చాం. అసోసియేషన్‌ అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తాను. ప్రకాశ్‌రాజ్‌ ప్యానెల్‌ సభ్యులు రాజీనామాలు చేశారని.. మీడియా ద్వారానే తెలిసింది. వాళ్ల రాజీనామా లేఖలు ఇంకా మాకు అందలేదు. రాజీనామా లేఖలు అందాక  ఆ విషయంపై స్పందిస్తాను’ అని విష్ణు అన్నారు.

అక్టోబర్‌ 10న జరిగిన ‘మా’ ఎన్నికల్లో ప్రకాశ్‌రాజ్‌ ప్యానెల్‌  సిని‘మా’ బిడ్డలం నుంచి గెలిచిన 11 మంది సభ్యులు తమ పదవులకి రాజీనామా చేశారు. ‘మా’ సంక్షేమం కోసమే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు వారు తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని