west side story: స్పీల్‌బర్గ్‌ చిత్రం డిసెంబరులో..

ప్రముఖ హాలీవుడ్‌ దర్శకుడు స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌ దర్శకత్వం వహించిన చిత్రం ‘వెస్ట్‌ సైడ్‌ స్టోరీ’. 1957 న్యూయార్క్‌ పట్టణంలో సాగే ప్రేమ కథతో ఈ చిత్రం రూపొందింది. ఈ చిత్రాన్ని మనదేశంలో డిసెంబరు 10న

Updated : 20 Nov 2021 07:32 IST

ప్రముఖ హాలీవుడ్‌ దర్శకుడు స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌ దర్శకత్వం వహించిన చిత్రం ‘వెస్ట్‌ సైడ్‌ స్టోరీ’. 1957 న్యూయార్క్‌ పట్టణంలో సాగే ప్రేమ కథతో ఈ చిత్రం రూపొందింది. ఈ చిత్రాన్ని మనదేశంలో డిసెంబరు 10న విడుదల చేస్తున్నట్లు ట్వంటీయెత్‌ సెంచురీ స్టూడియోస్‌ ప్రకటించింది. అన్సెల్‌ ఎల్గోర్ట్‌, రచెల్‌ జెగ్లెర్‌, అరియానా డి బోస్‌, డేవిడ్‌ ఆల్వరేజ్‌ తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. టోనీ, మరియ అనే యువ జంట ప్రేమ కథగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని అలరిస్తుందని చిత్రవర్గాలు చెబుతున్నాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని