Pushpa: ‘పుష్ప’పార్ట్-2లో సుకుమార్ ఏం చూపించబోతున్నారు?
‘పుష్ప: ది రైజ్’ విడుదలై మాస్లో మంచి టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా అల్లు అర్జున్ నటన, యాక్షన్ సన్నివేశాలకు ఆయన అభిమానులు ఫిదా అవుతున్నారు.
ఇంటర్నెట్‌డెస్క్: ‘పుష్ప: ది రైజ్’ విడుదలై మాస్లో మంచి టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా అల్లు అర్జున్ నటన, యాక్షన్ సన్నివేశాలకు ఆయన అభిమానులు ఫిదా అవుతున్నారు. దీనికి కొనసాగింపుగా ‘పార్ట్-2’ కూడా విడుదలవుతుందని బృందం ఇప్పటికే ప్రకటించింది. ‘పుష్ప: ది రూల్’(Pushpa: The rule) టైటిల్‌తో రానున్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. తొలి భాగంలో ఒక సాధారణ కూలీగా జీవితం మొదలు పెట్టిన పుష్పరాజ్ ఎర్రచందనం స్మగ్లింగ్ మాఫియాను శాసించే స్థాయికి ఎలా ఎదగాడన్నది అదిరిపోయేలా చూపించారు దర్శకుడు సుకుమార్. చాలా ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండానే వదిలేశారు. దీంతో మలి భాగంలో ఏం చూపించబోతున్నారా? అన్న ఆసక్తి మొదలైంది! బహుశా ఇలా ఉండవచ్చు.
🪓 ప్రేక్షకులను ఉత్కంఠతో ఎదురు చూసేలా బలమైన పాయింట్‌తో ‘పుష్ప: ది రైజ్’కు ముగింపు ఇవ్వలేదు దర్శకుడు సుకుమార్. ఇలాంటి ప్రశ్నలు ఏవైనా వదిలేస్తే రెండో భాగంపై అంచనాలు పెరిగిపోతాయని అనుకుని ఉండవచ్చు.
🪓 ‘పుష్ప: ది రూల్’ చూడాలని వచ్చే ప్రేక్షకుడు ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్‌కు రావాలని సుకుమార్ భావించి ఉండవచ్చు. ఎందుకంటే తనదైన మార్కు ట్విస్ట్‌లతో ప్రేక్షకులను అలరించడమే సుకుమార్ స్టైల్. గతంలో ఆయన తెరకెక్కించిన చిత్రాలను చూస్తే ఈ విషయం ఇట్టే అర్థమవుతుంది.
🪓 పార్ట్-1లో మంగళం శ్రీనుగా ప్రతినాయకుడిగా పాత్రలో సునీల్ సరికొత్తగా కనిపించారు. రెండో భాగంలో ఈ పాత్రను మరింత క్రూరంగా చూపించే అవకాశం ఉంది. ముఖ్యంగా పుష్పరాజ్‌ను ఎదుర్కొనే దీటైన పాత్రగా మరోసారి సునీల్‌కు ఎలివేషన్ లభించవచ్చు.
🪓 ‘రంగస్థలం’లో రంగమ్మత్తగా చెరగని ముద్రవేసిన అనసూయ ఇందులో ద్రాక్షాయణిగా కనిపించింది. పార్ట్-1లో ఈ పాత్రకు సంబంధించిన బలమైన నాటకీయత ఎక్కడా కనిపించలేదు. బహుశా ‘పుష్ప: ది రూల్’లో కోసమే తొలి భాగంలో ఈ పాత్రకు ఎక్కువ స్కోప్ ఇవ్వలేదనుకుంటా.
🪓 ఇక ఎస్పీ భన్వర్ సింగ్ షెకావత్‌గా ద్వితీయార్ధం ఆఖరులో ఫహద్ ఫాజిల్ పాత్ర పరిచయమైంది. రెండో భాగంలోనూ ఇది కొనసాగనుంది. తొలి భాగంలో పుష్పరాజ్ నుంచి ఎదురైన అవమానానికి భన్వర్‌సింగ్ ఎలా ప్రతీకారం తీర్చుకుంటాడన్న దాన్ని పార్ట్-2లో చూపించనున్నారు. అది ఒంటరిగానా, లేదా మంగళం శ్రీను, ద్రాక్షాయణిలతో కలిశా? అన్నది ఆసక్తికరం.
🪓 జాలీ రెడ్డిగా కనిపించిన కన్నడ నటుడు ధనుంజయ పాత్రను కూడా పార్ట్-1లో ముగించలేదు. అంటే పార్ట్-2 ఈ పాత్రకు మరింత ప్రాధాన్యం ఉండే అవకాశం ఉంది.
🪓 ఎవరా మురుగన్? అతనేనా? సినిమా మొత్తం చూసిన ప్రేక్షకులకు తొలిచేస్తున్న మరో ప్రశ్న మురుగన్. సినిమాలో ఆ పేరు ప్రస్తావన చాలాసార్లు వస్తుంది, ఓ సందర్భంలో మురుగన్ ఓ వ్యక్తి అనుమతి కోసం వెయిట్ చేసినట్లు చూపిస్తారు. పార్ట్-2 కోసమే సుక్కు ఆ కీలక వ్యక్తి పాత్రను పూర్తిగా రివీల్ చేయలేదనిపిస్తోంది. మరి ఆ కీలక పాత్రలో కనిపించేది ఎవరు? మంగళం శ్రీను, ద్రాక్షాయణి, భన్వర్ సింగ్ పాత్ర కన్నా బలమైందా?
🪓‘పుష్ప’లో రష్మిక నటన అల్టిమేట్ అంటూ చిత్ర బృందం పొగడ్తలతో ముంచెత్తింది. అయితే, ఫస్ట్ పార్ట్‌లో పుష్పరాజ్ ప్రియురాలిగా మాత్రమే కనిపించింది. మరి ‘ది రూల్’లో ఆమె కూడా ఏ మేరకు ఉంటుందో చూడాలి. అన్నట్లు సినిమా ప్రచారంలో ఆమె కూడా రెండో పార్టులోనే నా పాత్ర ఇంకా బలంగా ఉంటుంది అని చెప్పింది.
🪓 తొలి భాగంలో ఉన్న విలన్స్‌ను రెండో భాగంలో చూపిస్తే అంతగా మజా ఉండదు. కాబట్టి రెండో పార్టుకి వచ్చేసరికి బలమైన విలన్ అవసరం. హీరోకు పోటీగా నిలబడే ఆ వ్యక్తి ఎవరు అనేదే ఇక్కడ ప్రశ్న. పోలీసు పాత్రలో ఫహాద్ ఫాజిల్‌ను పూర్తి స్థాయి విలన్‌గా చూపిస్తారని ఆశించలేం. ఆ ఇంకో పాత్ర... బన్నీలోని హీరోయిజాన్ని ఎలివేట్ చేయిస్తుంది అని టాలీవుడ్ టాక్.
🪓 తన తండ్రి ఎవరు అనే ప్రశ్న పుష్పరాజ్‌కి సినిమా అంతటా వినిపిస్తుంటుంది. దానికి సమాధానం నేరుగా చెప్పే సీన్లు సినిమాలో బాకీ. అవి రెండో పార్టులో ఉంటాయి. అజయ్ పాత్రకు కూడా పుష్పరాజ్ సరైన సమాధానం చెప్పాలి. అది కూడా ‘ది రూల్’లోనే.
🪓 సుకుమార్ - దేవిశ్రీ ప్రసాద్ అంటే... ఐటెమ్ సాంగ్ పక్కా అంటారు. తొలి పార్టులో ఆ బాధ్యత సమంత తీసుకుంది. ఇప్పుడు రెండో పార్టులో ఆ ప్రత్యేక గీతంలో ఎవరు ఆడిపాడతారో చూడాలి.
🪓 అపరాధభావం, పరాభవంతో టాస్క్‌ఫోర్స్ అధికారి గోవిందప్ప (శత్రు) ట్రాన్స్ఫర్ మీద వెళ్లిపోతాడు. తిరిగి రెండో పార్టులో ఏదో సందర్భంలో ఈ పాత్రను కూడా ఆశించొచ్చు. పుష్పరాజ్ ఎదిగే క్రమంలో ‘నీకు ఇక్కడి ఇబ్బందులు తెలియవులే అప్పా’ అనే డైలాగ్ ఉంటుంది. దీనిపై జస్టిఫికేషన్ తప్పక ఉంటుంది.
► Read latest Cinema News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రామ్ చరణ్ బర్త్‌డే.. ఆయన బాల్యం గురించి ఈ విశేషాలు తెలుసా..?
టాలీవుడ్ ప్రముఖ హీరో రామ్ చరణ్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని విశేషాలు.. -
Challenging Roles: పాత్రలకు ప్రాణం పోశారు.. పృథ్వీరాజ్ సుకుమారన్ ఇలా.. విక్రమ్ అలా!
పాత్రలకు ప్రాణం పోసేందుకు మానసికంగా, శారీరకంగా ఎంతగానో శ్రమించిన నటులు, వారి సినిమాల వివరాలివీ.. -
Tollywood Actresses: అగ్ర నాయికలు అలా రూటు మార్చి.. హాట్‌టాపిక్‌గా నిలిచి!
అగ్ర కథానాయిక- వర్ధమాన హీరో కాంబినేషన్లో వచ్చిన సినిమాల విశేషాలు.. -
Actors turned Directors: ధనుష్, ఉపేంద్ర, కంగన.. మళ్లీ మరో కోణాన్ని చూపించేందుకు...
స్వీయ దర్శకత్వంలో నటించిన హీరో/హీరోయిన్‌పై ప్రత్యేక కథనం. ఎవరు ఏ సినిమాతో అలరించేందుకు సిద్ధమయ్యారంటే? -
Alia Bhatt: అందుకు క్లాస్‌లో బెంచీలు తుడిచి.. బ్యాగ్రౌండ్ ఉన్నా ఆడిషన్ ఇచ్చి: అలియా భట్ బర్త్‌డే స్పెషల్
అలియా భట్ పుట్టినరోజు సందర్భంగా ఆమె గురించి పలు విశేషాలు.. -
Mamitha Baiju: గిరిజ, సాయి పల్లవిలా మమితా బైజు.. రాజమౌళి మెచ్చిన ఈ నటి ఎవరు?
యంగ్ హీరోయిన్ మమితా బైజును అగ్ర దర్శకుడు ప్రశంసించడం అందరి దృష్టినీ ఆకర్షించింది. ఎవరీ నటి? -
Comedians as Heros: కమెడియన్లు.. కథానాయకులై.. ఎవరెవరు ఏ సినిమాతో అలరించారంటే?
కమెడియన్లుగా కెరీర్‌ని ప్రారంభించి హీరోగాను సినిమాలు చేస్తున్న నటులపై ప్రత్యేక కథనం.. -
Krystyna Pyszkova: మనిషే కాదు.. మనసూ అందమే: మిస్ వరల్డ్ క్రిస్టినా గురించి ఆసక్తికర విశేషాలివీ
ప్రపంచ సుందరి-2024 కిరీటం దక్కించుకున్న క్రిస్టినా పిస్కోవా గురించి ఆసక్తికర విశేషాలు మీకోసం.. -
Miss World Pageant: తొలుత ‘బికినీ కాంటెస్ట్’గా.. 28 ఏళ్ల తర్వాత భారత్ ఆతిథ్యం.. ‘మిస్ వరల్డ్’ పోటీల సంగతులివీ!
భారత్ ఆతిథ్యంలో 71వ ఎడిషన్ ‘మిస్ వరల్డ్’ పోటీలు జరుగుతున్నాయి. శనివారం విజేతను ప్రకటించనున్నారు. ఈ సందర్భంగా ఈ అందాల పోటీల గురించి పలు ఆసక్తికర విశేషాలు.. -
Sini Shetty: మిస్ వరల్డ్ పోటీలు.. ‘బెస్ట్ డిజైనర్ డ్రెస్’ విజేతగా సినిశెట్టి
మిస్ వరల్డ్ 2024 పోటీల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సినిశెట్టి గురించి ఆసక్తికర విశేషాలివీ.. -
Movies in March: మార్చిలో మురిపించే చిత్రాలు.. వరుణ్ తేజ్ అలా.. ‘టిల్లు’ ఇలా!
మార్చిలో విడుదల కానున్న సినిమాలపై ప్రత్యేక కథనం. ఏ హీరో చిత్రం ఏ రోజు ప్రేక్షకుల ముందుకు రానుందంటే? -
Valentine Day: వాలంటైన్స్ డేకు రీరిలీజ్ కానున్న ప్రేమకథా చిత్రాలివే..
వాలంటైన్స్ డే సందర్భంగా గతంలో అలరించిన ప్రేమ కథాచిత్రాలు మరోసారి వినోదాన్ని పంచేందుకు సిద్ధమయ్యాయి. -
తొలి సినిమా ఫ్లాప్.. ‘బండమొహం వీడేం హీరో’ అన్నారు.. రీల్ కెరీర్ To పొలిటికల్ ఎంట్రీ.. విజయ్ లైఫ్ జర్నీ ఇదే!
Actor vijay: తల్లిదండ్రులకు సినీ నేపథ్యం ఉన్నా, నటుడిగా తనకంటూ తమిళనాట గుర్తింపు తెచ్చుకున్న విజయ్.. రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. ఈ క్రమంలో ఇప్పటివరకూ ఆయన లైఫ్ జర్నీ ఎలా సాగింది? -
Jeethu Joseph: 17 సినిమాలు.. మూడే ఫ్లాప్‌లు.. చైనీస్, ఇండోనేషియా, కొరియాలోనూ రీమేక్ అయిన మొదటి భారతీయ సినిమా ఆయనదే!
Jeethu Joseph: మోహన్‌లాల్ కథానాయకుడిగా జీతూ జోసెఫ్ తెరకెక్కించిన ‘నెరు’ ఓటీటీలో దూసుకుపోతోంది. ఈ క్రమంలో జీతూ గురించి ఆసక్తికర విషయాలు.. -
Chiranjeevi: ఆ అవమానమే.. సుప్రీం హీరోను మెగాస్టార్ చేసింది: పద్మ విభూషణ్ చిరంజీవి ప్రయాణమిది!
ప్రముఖ నటుడు చిరంజీవికి అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన ‘పద్మ విభూషణ్’ అవార్డు వరించింది. ఈ సందర్భంగా ఆయన గురించి ప్రత్యేక కథనం.. -
Salaar Part 2: ఈ ప్రశ్నలకు సమాధానం... ‘సలార్-2: శౌర్యాంగ పర్వం’ చెబుతుంది!
‘సలార్’ పార్ట్-1 చూసిన వారందరూ ఇప్పుడు పార్ట్-2 ‘శౌర్యాంగ పర్వం’ కోసం ఎదురు చూస్తున్నారు. మరి ఈ భాగంలో ఏయే ప్రశ్నలకు సమాధానం లభించనుంది? -
Telugu Movies: రిపబ్లిక్ డే ‘డబ్బింగ్’ చిత్రాలదే.. ఆ రోజు ‘ఈగల్’ సింగిల్‌గా..?
రిపబ్లిక్ డే సందర్భంగా విడుదలకానున్న చిత్రాలు, ఫిబ్రవరి రెండో వారంలో రాబోతున్న సినిమాలపై ప్రత్యేక కథనం.. -
Hombale Films: ఆ పరాజయం.. ‘కేజీయఫ్’, ‘సలార్’ హిట్లకు కారణమైంది: హోంబలే ప్రయాణమిదీ
ప్రముఖ నిర్మాణ సంస్థ ‘హోంబలే ఫిల్మ్స్’కు ఆ పేరు ఎందుకు పెట్టారో తెలుసా? ఆ బ్యానర్‌పై వచ్చిన సినిమాల వివరాలివీ.. -
Pallavi prashanth: ‘బిగ్‌బాస్’కు వెళ్తానంటే ఎగతాళి చేశారు.. ‘విన్నర్’గా నిలిచిన ‘రైతుబిడ్డ’ జర్నీ ఇదీ!
bigg boss 7 telugu winner pallavi prashanth: ఫోక్ సాంగ్స్ క్రియేటర్‌గా జీవితాన్ని మొదలు పెట్టిన పల్లవి ప్రశాంత్ లైఫ్ జర్నీ సాగిందిలా..! -
Bollywood Roundup: రీమేక్స్‌తో డీలా.. షారుక్ సినిమాలతో కొత్త కళ: బాలీవుడ్ తీరిలా!
ఈ ఏడాది విడుదలైన బాలీవుడ్ సినిమాలపై ప్రత్యేక కథనం. ఏ చిత్రం హిట్? ఏది ఫట్? చూసేయండి.. -
Venkatesh: అద్దమే ఫిల్మ్‌స్కూల్.. హోస్ట్‌గా ఆ షోస్‌కు ‘నో’: వెంకటేశ్ గురించి ఈ విశేషాలు తెలుసా?
ప్రముఖ హీరో వెంకటేశ్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయన సినిమాల గురించి పలు ఆసక్తికర సంగతులు చూద్దాం..
తాజా వార్తలు (Latest News)
-
సీ-విజిల్‌కు తాకిడి.. రెండు వారాల్లోనే 79 వేల ఫిర్యాదులు
-
సిరియాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్.. 42 మంది మృతి
-
లోక్‌సభ ఎంపీల్లో 225 మందిపై క్రిమినల్ కేసులు: ఏడీఆర్
-
బాబాయిని చంపిన వ్యక్తికి ఎంపీ టికెట్.. చెల్లెలుపై కేసులు: చంద్రబాబు
-
ఆ నగ్న ఊరేగింపు ఫొటోకు అవార్డు.. నెట్టింట ఆగ్రహం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM