Manike Mage Hithe: సూపర్‌స్టార్‌ మది దోచిన వైరల్‌ సాంగ్‌.. ఇంతకీ ఎవరా సింగర్‌?

‘మణికే మాగే హిథే..!’.. గత కొన్ని నెలల నుంచి ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తోన్న పాట. ముఖ్యంగా ఇన్‌స్టాలో ఈ పాటకు ఉన్న ఫాలోవర్స్, లవర్స్‌ సంఖ్య అంతా ఇంతా...

Updated : 09 Dec 2022 13:11 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘మాణికే మాగే హితే..!’.. గత కొన్ని నెలల నుంచి ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తోన్న పాట. ముఖ్యంగా ఇన్‌స్టాలో ఈ పాటకు ఉన్న ఫాలోవర్స్, లవర్స్‌ సంఖ్య అంతా ఇంతా కాదు. శ్రీలంకకు చెందిన ఓ పాప్‌ సింగర్‌ ఆలపించిన ఈ ఫీల్‌ గుడ్‌ పాటకు ఇటీవల మన బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ కూడా ఫిదా అయ్యారు. ఈ పాట తనకు ఎంతగానో నచ్చిందని.. ఒక రాత్రంతా రిపీట్‌ మోడ్‌లో విన్నానని ఆయన చెప్పారు. మరోవైపు, ఒరిజినల్‌ వీడియోలో ఉన్న లిరిక్స్ అర్థం కాకపోయినప్పటికీ ఈ ట్యూన్‌కి అన్ని భాషల వారు మనసుపారేసుకున్నారు. ఈ క్రమంలోనే బెంగాలీ, తమిళం, తెలుగు భాషల్లో ఈ పాటను రీమేక్‌ చేశారు. ఇంతటి పాపులారిటీ సొంతం చేసుకున్న ‘మాణికే మాగే హితే’.. సింగర్‌ ఎవరు?

‘మాణికే మాగే హితే’..‘రాప్‌ ప్రిన్సెస్‌’..

‘మాణికే మాగే హితే’ పాటను అలపించింది శ్రీలంకలోని కొలంబోకు చెందిన ప్రముఖ పాప్‌ సింగర్‌ యొహాని డిసెల్వా. ఆమె కేవలం పాప్‌ సింగర్‌ మాత్రమే కాదు.. పాటల రచయిత, నిర్మాత, బిజినెస్‌ వుమెన్‌ కూడా. యొహాని తండ్రి మాజీ ఆర్మి అధికారి. తల్లి ఎయిర్‌హోస్టస్‌. దీంతో యొహాని చిన్నతనంలోనే మలేసియా, బంగ్లాదేశ్‌ వంటి ప్రాంతాల్లో పర్యటించారు. సంగీతంపై ఉన్న ఆసక్తిని గుర్తించి వాళ్లమ్మ.. ఎంతో ప్రోత్సాహం అందించారు. యూట్యూబర్‌గా కెరీర్‌ ఆరంభించిన ఆమె.. ‘దేవియంగే బారే’ అనే పాటతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. యూట్యూబ్‌ వేదికగా ఇలా ఎన్నో పాటలు విడుదల చేసి అందరి మన్ననలు పొందారు. ఈ క్రమంలోనే ‘రాప్‌ ప్రిన్సెస్‌’ అనే బిరుదు ఆమెను వరించింది. ఇంతటి పాపులారిటీ సొంతం చేసుకున్న యొహాని 2021 మే నెలలో ‘మాణికే మాగే హితే’ పాట ఆలపించి సోషల్‌మీడియాను షేక్‌ చేశారు. ఇప్పటివరకూ ఈ పాటను 8 కోట్ల మంది వీక్షించారు.







Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని