Bigg Boss 5: వాళ్లిద్దరూ కాలిపోతే సన్నీ మిగులుతాడు.. నువ్వు యాక్టింగ్‌ నెం.1

ఈ వారం ఎలిమినేషన్‌ నుంచి బయటపడేందుకు బిగ్‌బాస్‌ (Bigg Boss) బంపర్‌ ఆఫర్‌ ఇచ్చాడు. నామినేషన్స్‌లో ఉన్న ఇంటి సభ్యుల్లో ఒకరికి ఎవిక్షన్‌ ప్రీ పాస్‌ ఇవ్వనున్నట్లు ప్రకటించాడు....

Updated : 19 Nov 2021 20:05 IST

హైదరాబాద్‌: ఈ వారం ఎలిమినేషన్‌ నుంచి బయటపడేందుకు బిగ్‌బాస్‌ (Bigg Boss) బంపర్‌ ఆఫర్‌ ఇచ్చాడు. నామినేషన్స్‌లో ఉన్న ఇంటి సభ్యుల్లో ఒకరికి ఎవిక్షన్‌ ఫ్రీ పాస్‌ ఇవ్వనున్నట్లు ప్రకటించాడు. అయితే, ఎవిక్షన్‌ ఫ్రీ పాస్‌ని దక్కించుకునేందుకు ఇంటిసభ్యులందరూ కలిసి ‘నిప్పులే శ్వాసగా.. గుండెలో ఆశగా’ టాస్క్‌ ఆడాలని సూచించాడు. ఈ టాస్క్‌లో భాగంగా బజర్‌ మోగిన వెంటనే ఎవరైనా ఇద్దరు ఇంటి సభ్యులు వెళ్లి.. ఫైర్‌ ఇంజిన్‌ వ్యాన్‌లో కూర్చొని.. నామినేషన్స్‌లో ఉన్న ఇద్దరు ఇంటిసభ్యులతో ఎవిక్షన్‌ ఫ్రీ పాస్‌ గురించి చర్చించాలి. ఎవిక్షన్‌ ఫ్రీ పాస్‌ ఎందుకు పొందాలనుకుంటున్నారో చెప్పాలి. ఈ క్రమంలో మొదట బజర్‌ మోగిన వెంటనే సిరి-షణ్ముఖ్‌.. నామినేషన్స్‌లో ఉన్న సన్నీ-ప్రియాంకలతో మాట్లాడారు.

‘‘కొన్ని విషయాల్లో నేను కోపంగా వ్యవహరిస్తుంటాను. కానీ నన్ను నేను మార్చుకునేందుకు ఎంతో ప్రయత్నిస్తున్నాను’’ అని సన్నీ తెలపగా.. ‘‘ఈ హౌస్‌లో నేను స్ట్రాంగ్‌ అని అనుకుంటున్నాను. నాకంటూ కొన్ని డ్రీమ్స్‌ ఉన్నాయి. కాబట్టి ఈ హౌస్‌లో నేను ముందుకు కొనసాగాలంటే ఎవిక్షన్‌ ఫ్రీ పాస్‌ కావాలనుకుంటున్నాను’ అని పింకీ తెలిపింది. అనంతరం ఫైర్‌ వ్యాన్‌లోకి వెళ్లిన అనీమాస్టర్‌-శ్రీరామ్‌.. నామినేషన్స్‌లో ఉన్న సిరి-షణ్ముఖ్‌లతో మాట్లాడారు. తమకు ఎవిక్షన్‌ ఫ్రీ పాస్‌ అవసరం లేదని.. ప్రేక్షకుల ఓటింగ్‌ మాత్రమే ముఖ్యమని షణ్ముఖ్‌-సిరి తెలిపారు. మరి, ఎవిక్షన్‌ ఫ్రీ పాస్‌ దక్కించుకుని నామినేషన్స్‌ నుంచి ఎవరు బయటపడతారో తెలియాలంటే ఈ రోజు ప్రసారం కానున్న ఎపిసోడ్‌ చూడాల్సిందే.

Read latest Cinema News and Telugu News



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని