Priyanka Chopra: ఈ స్థాయికి కారణం నా నిర్ణయాలే

ఏళ్ల తరబడి చిత్రసీమలో సత్తా చాటే నాయికల సంఖ్య చాలా తక్కువగానే ఉంటుంది. అలాంటి నాయికల జాబితాలో ప్రియాంక చోప్రా కచ్చితంగా ఉంటుంది. బాలీవుడ్‌లో ఆమె అడుగుపెట్టి 18 ఏళ్లు గడిచిపోయాయి.

Updated : 27 Dec 2021 07:05 IST

ళ్ల తరబడి చిత్రసీమలో సత్తా చాటే నాయికల సంఖ్య చాలా తక్కువగానే ఉంటుంది. అలాంటి నాయికల జాబితాలో ప్రియాంక చోప్రా కచ్చితంగా ఉంటుంది. బాలీవుడ్‌లో ఆమె అడుగుపెట్టి 18 ఏళ్లు గడిచిపోయాయి. ఈ ప్రయాణంలో ఎన్నో విజయాలు, జాతీయ పురస్కారాలు అందుకుందామె. తన జీవితంలో కీలకమైన అడుగు హాలీవుడ్‌. అక్కడా వరసగా సినిమాల్లో నటిస్తూ అంతర్జాతీయంగానూ సత్తా చాటుతోంది. ‘‘ఈ రోజు నేను ఇలా ఉన్నానంటే కారణం నా నిర్ణయాలే. ఈ రోజు ఇక్కడ ఇలా ఉన్నందుకు ఎంతో గర్వపడుతున్నాను. ఇంకా నేను ప్రయాణించాల్సిన దూరం చాలా ఉంది. ఇప్పటివరకూ ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను. ఏదీ అంత సులువుగా అయితే రాలేదు’’అని చెబుతోంది ప్రియాంక.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని