Published : 22 Dec 2021 22:02 IST

Senapathi: రాజేంద్రప్రసాద్‌ కొత్త అవతారం..ఉత్కంఠ రేకెత్తిస్తున్న‘సేనాపతి’ ట్రైలర్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్‌ నటించిన చిత్రం ‘సేనాపతి’. పవన్‌ సాధినేని దర్శకత్వం వహించారు. ఓటీటీ ‘ఆహా’లో డిసెంబరు 31న స్ట్రీమింగ్‌ కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ట్రైలర్‌ను విడుదల చేసింది. రాజేంద్ర ప్రసాద్‌ ఇప్పటి వరకూ కనిపించని విభిన్న లుక్‌లో దర్శనమిచ్చారు. డబ్బు, హత్య చుట్టూ సాగే సన్నివేశాలతో ట్రైలర్‌ ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తిస్తోంది. ‘ఇది సేనాపతి. దీంతో చాలా జాగ్రత్తగా ఉండాలి’ అని రాజేంద్ర ప్రసాద్‌ చెప్పిన డైలాగ్‌ సినిమాపై అంచనాలు పెంచేలా ఉంది. ఈ సినిమాని విష్ణు ప్రసాద్‌, సుస్మిత కొణిదెల నిర్మించారు. శ్రవణ్‌ భరద్వాజ్‌ సంగీతం అందించారు.

Read latest Cinema News and Telugu News


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts