Wow 3: లక్షమందికి సాయం చేయాలనేదే నా లక్ష్యం: ఆలీ

‘నా ట్రస్ట్‌ ద్వారా లక్షమందికి సాయం చేయాలనేదే నా లక్ష్యం’ అని ప్రముఖ హాస్య నటుడు ఆలీ అన్నారు. సాయి కుమార్‌ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమయ్యే ‘వావ్‌ 3’ కార్యక్రమం వేదికగా ఈ విషయాన్ని తెలియజేశారు.

Published : 18 Aug 2021 15:05 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘నా ట్రస్ట్‌ ద్వారా లక్షమందికి సాయం చేయాలనేదే నా లక్ష్యం’ అని ప్రముఖ హాస్య నటుడు ఆలీ అన్నారు. సాయి కుమార్‌ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమయ్యే ‘వావ్‌ 3’ కార్యక్రమం వేదికగా ఈ విషయాన్ని తెలియజేశారు. ఆలీతోపాటు రాజా రవీంద్ర, సుమన్‌ శెట్టి, కరాటే కల్యాణి ఈ షోకి విచ్చేసి సందడి చేశారు. ఆగస్టు 24న ప్రసారం కానున్న ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. సాయి కుమార్‌ ఆసక్తికర ప్రశ్నలు, నటుల కొంటె సమాధానాలతో ఈ ప్రోమో ఆద్యంతం అలరిస్తోంది. ‘భీమ్లా నాయక్‌’ బీజీఎం (నేపథ్య సంగీతం) స్టెప్పులతో ఈ వీడియో ప్రారంభమవుతుంది. నెగెటివ్‌ పాత్రలు పోషించాలనుందని సుమన్‌ శెట్టి చెప్పగా.. రాజా రవీంద్ర, కరాటే కల్యాణి మధ్య సాగే సంభాషణలు నవ్వులు పంచుతున్నాయి. ‘ఆకుచాటు పిందె తడిసె’ పాటకు ఆలీ, కల్యాణి చేసిన డ్యాన్సు ఆకట్టుకుంటుంది. ‘అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి’ చిత్రంలో జయసుధ పాత్ర వృత్తి ఏంటి? అని సాయి కుమార్‌ ప్రశ్నించగా ‘తల్లి’ అంటూ సుమన్‌ శెట్టి సమాధానమిస్తాడు. ‘వృత్తి.. వృత్తి’ అంటూ రాజా రవీంద్ర కామెడీ చేశారు. ప్రముఖ నటుడు దివంగత అక్కినేని నాగేశ్వరరావు గురించి తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు ఆలీ. ‘నీ అంతిమ లక్ష్యం ఏంటి?’ అని సాయి కుమార్‌ అడగ్గా ‘నాకొక ట్రస్టు ఉంది. దాని ద్వారా లక్షమందికి సాయం చేయాలి. ఇప్పటికి 10వేల మందికి సాయం అందింది. మరో 90వేల మందికి అందించాలి’ అని ఆలీ తెలిపారు. ఒక్కొక్కరుగానే ఎంతో అలరించే ఈ నటులంతా ఒక్క చోట చేరితే ఎలా ఉంటుందో మీరూ చూసేయండి....

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని