
Yadhalo Mounam: శ్రీదేవి మేనకోడలు, శివాజీ గణేశన్ మనవడు జంటగా.. ‘ఎదలో మౌనం’
ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ తమిళ నటుడు దివంగత శివాజీ గణేశన్ మనవడు దర్శన్ గణేశన్, దివంగత నటి శ్రీదేవి మేనకోడలు శిరీషపై రూపొందిన గీతం ‘యదలో మౌనం’. భరతనాట్య కళాకారిణి, ప్రముఖ నటి దివంగత పద్మిని రామచంద్రన్ మనవరాలు లక్ష్మీదేవి దర్శకత్వం వహించారు. ఈ పాటని శుక్రవారం విడుదల చేశారు. పెళ్లి నేపథ్యంలో సాగే ఈ గీతం అన్ని వర్గాల శ్రోతల్ని అలరించేలా ఉంది. దర్శన్, శిరీష హావభావాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ గీతానికి వరుణ్ మేనన్, అచ్చు రాజమణి స్వరాలు సమకూర్చారు. పూర్ణాచారి సాహిత్యం అందించారు. అచ్చు రాజమణి ఆలపించారు. ఈ వీడియోకి ఛాయాగ్రహణం: అభినందన్ రామానుజం, కూర్పు: ఆంటోనీ గొంజాల్వెజ్. ఆంటోనీ ప్రముఖ దర్శకులు శంకర్, గౌతమ్ వాసుదేవ్ మేనన్ దగ్గర పనిచేశారు. లక్ష్మీదేవి ‘వెన్ ది మ్యూజిక్ ఛేంజెస్’ అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఆస్కార్ ‘లైవ్ యాక్షన్ షార్ట్స్’ కేటగిరీలో నామినేట్ అయింది.
► Read latest Cinema News and Telugu News
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Salmonella: ‘సాల్మొనెల్లా’ కలకలం.. ప్రపంచంలోనే అతిపెద్ద చాక్లెట్ ప్లాంట్‌లో ఉత్పత్తి నిలిపివేత!
-
Technology News
Android 12: ఆండ్రాయిడ్ 12 యూజర్లకు గూగుల్ మరో కొత్త యాప్
-
General News
Cesarean Care: శస్త్రచికిత్స తర్వాత ఏం జరుగుతుందంటే...!
-
Technology News
Xiaomi 12S Ultra: సోని సెన్సర్‌తో షావోమి ఫోన్ కెమెరా.. ఇక మొబైల్‌తోనే వీడియో షూట్!
-
General News
HMDA: హెచ్ఎండీఏ ఈ-వేలానికి ఆదరణ.. తుర్కయాంజిల్‌లో గజం రూ.62,500
-
General News
Health: మత్తు వ్యసనాలను వదిలించుకోండి ఇలా..!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Maharashtra Crisis: ఫడణవీస్ ఎందుకు సీఎం బాధ్యతలు చేపట్టలేదంటే?
- Meena: అలా ఎంత ప్రయత్నించినా సాగర్‌ను కాపాడుకోలేకపోయాం: కళా మాస్టర్
- Vijay Deverakonda: విజయ్ దేవరకొండతో మీటింగ్.. అభిమాని భావోద్వేగం
- Eknath Shindhe: నాడు ఆటో నడిపారు.. ఇకపై మహారాష్ట్రను నడిపిస్తారు..
- YSRCP: గన్నవరం వైకాపాలో 3 ముక్కలాట.. అభ్యర్థి ఎవరో తేల్చేసిన కొడాలి నాని
- Credit card rules: క్రెడిట్ కార్డుదారులూ అలర్ట్!.. జులై 1 నుంచి కొత్త రూల్స్
- Salmonella: ‘సాల్మొనెల్లా’ కలకలం.. ప్రపంచంలోనే అతిపెద్ద చాక్లెట్ ప్లాంట్‌లో ఉత్పత్తి నిలిపివేత!
- Maharashtra: ‘నాన్నే చెప్పేవారు.. మనకు చెందనిది ఎప్పటికీ మనతో ఉండదని..’: ఆదిత్య ఠాక్రే
- BJP: అంబర్‌పేట్‌లో భాజపా దళిత నాయకుడి ఇంట్లో భోజనం చేసిన యూపీ డిప్యూటీ సీఎం
- Raj Thackeray: అన్న రాజీనామా.. రాజ్ ఠాక్రే కీలక ట్వీట్