Naga Chaitanya: జీవితాంతం ఈ జ్ఞాపకాలు గుర్తుండిపోతాయ్‌..!

ఇటీవల విడుదలైన ‘లవ్‌స్టోరీ’తో తన కెరీర్‌లో మరో హిట్‌ అందుకున్నారు నటుడు నాగచైతన్య. ఫీల్‌గుడ్‌ మూవీగా తెరకెక్కిన ఈ సినిమాలో నాగచైతన్య.. రేవంత్‌ అనే మధ్యతరగతి కుర్రాడిగా నటించి....

Published : 30 Sep 2021 12:16 IST

పోస్ట్‌ పెట్టిన నటుడు నాగచైతన్య

హైదరాబాద్‌: ఇటీవల విడుదలైన ‘లవ్‌స్టోరీ’తో తన కెరీర్‌లో మరో హిట్‌ అందుకున్నారు నటుడు నాగచైతన్య. ఫీల్‌గుడ్‌ మూవీగా తెరకెక్కిన ఈ సినిమాలో నాగచైతన్య.. రేవంత్‌ అనే మధ్యతరగతి కుర్రాడి పాత్రలో నటించి అందరి మన్ననలు అందుకున్నారు. ఆయనకు జోడీగా సాయిపల్లవి ఎప్పటిలాగానే తనదైన శైలిలో మెప్పించారు. కాగా, ‘లవ్‌స్టోరీ’ విజయంపై తాజాగా నాగచైతన్య స్పందించారు. తనకు సూపర్‌హిట్‌ అందించిన టీమ్‌ మొత్తానికి ధన్యవాదాలు తెలిపారు. తాను జీవితాంతం గుర్తుంచుకొనేలా ఎన్నో మధుర జ్ఞాపకాలను ‘లవ్‌స్టోరీ’ అందించిందని నాగచైతన్య అన్నారు. ఈ మేరకు టీమ్‌తో దిగిన ఓ ఫొటోని ఆయన ట్విటర్‌ వేదికగా షేర్‌ చేశారు.

కుల వ్యవస్థ, అమ్మాయిలపై కుటుంబసభ్యులే లైంగిక దాడులకు పాల్పడుతున్నారనే సున్నితమైన అంశాలతో ‘లవ్‌స్టోరీ’ చిత్రాన్ని రూపొందించారు. శేఖర్‌ కమ్ముల దర్శకత్వం వహించిన ఈసినిమాలో చై జుంబా ట్రైనర్‌గా మెప్పించారు. బీటెక్‌ పూర్తి చేసి.. ఉద్యోగ వేటలో ఉన్న అమ్మాయిగా సాయిపల్లవి నటించారు. రాజీవ్‌ కనకాల, ఈశ్వరీ, దేవయానీ ఈ సినిమాలో కీలకపాత్రలు పోషించి.. తమ నటనతో మంచి మార్కులు కొట్టేశారు. పవన్‌ మ్యూజిక్‌తో మేజిక్‌ చేశారు. శ్రీ వేంకటేశ్వర సినిమాస్‌ బ్యానర్‌పై నారాయణ్‌ దాస్‌, రామ్మోహన్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని