Ante Sundaraniki:సుందరం చక్కిలిగింతలు

సుందరం ప్రపంచానికి స్వాగతం పలికాడు కథానాయకుడు నాని. కస్తూరి పూర్ణ వెంకట శేషసాయి పవన రామ సుందర ప్రసాద్‌ నామధ్యేయ అహంబో అభివాదే అంటూ ‘అంటే... సుందరానికి!’ చిత్రంలోని తన పాత్రని పరిచయం చేశారు. నాని కథానాయకుడిగా వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది

Updated : 02 Jan 2022 07:10 IST

సుందరం ప్రపంచానికి స్వాగతం పలికాడు కథానాయకుడు నాని. కస్తూరి పూర్ణ వెంకట శేషసాయి పవన రామ సుందర ప్రసాద్‌ నామధ్యేయ అహంబో అభివాదే అంటూ ‘అంటే... సుందరానికి!’ చిత్రంలోని తన పాత్రని పరిచయం చేశారు. నాని కథానాయకుడిగా వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. నజ్రియా ఫాహద్‌ కథానాయిక. నవీన్‌ యెర్నేని, రవిశంకర్‌.వై నిర్మాతలు. చిత్రీకరణ తుదిదశకు చేరుకుంది. శనివారం ప్రత్యేకమైన వీడియోని విడుదల చేసి సుందరం పాత్రని పరిచయం చేసింది చిత్రబృందం. చతుస్సాగర పర్యంతం అంటూ మొదలయ్యే ఈ వీడియో ‘అంటే చుందరానికి చమ్మర్‌లో చక్కిలిగింతలా...’ అనే మాటలతో ముగుస్తుంది. హాస్యప్రధానంగా సాగే కథతో ఈ చిత్రం రూపొందుతున్నట్టు స్పష్టమవుతోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని