Published : 16 Feb 2022 12:53 IST

Bappi Lahiri: తెలుగు హీరోలకు హిట్‌ సాంగ్స్‌ అందించిన సంగీత తార

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘పాపా రీటా’ వంటి ఫాస్ట్‌బీట్స్‌.. ‘చిలుకా క్షేమమా’ లాంటి మనస్సుని హత్తుకునే మెలోడీస్‌తో తెలుగు చిత్రపరిశ్రమలో సంగీత దర్శకుడిగా అనతికాలంలో ఖ్యాతి పొందారు బప్పి లహిరి. సంగీత దర్శకుడిగా బాలీవుడ్‌లో పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్న ఆయన ‘సింహాసనం’తో మ్యూజిక్‌ డైరెక్టర్‌గా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమయ్యారు. సూపర్‌స్టార్‌ కృష్ణ-జయప్రద జంటగా నటించిన ఈ సినిమాలోని ప్రతిపాట సూపర్‌హిట్టే. ముఖ్యంగా ‘ఆకాశంలో ఒక తార’ కృష్ణ కెరీర్‌లోనే ఎప్పటికీ గుర్తుండిపోయే ఓ హిట్‌ పాట. దీంతో తెలుగులో ఆయనకు వరుస ప్రాజెక్ట్‌లు వరించాయి. అలా, చిరంజీవి కథానాయకుడిగా నటించిన ‘స్టేట్‌రౌడీ’ ‘గ్యాంగ్‌లీడర్‌’, ‘రౌడీ అల్లుడు’ సినిమాలకు సంగీతం అందించారు. ఆ మూడు సినిమాల్లోని పాటలు ఇప్పటికీ శ్రోతల్ని అలరిస్తున్నాయి. బప్పి లహిరి అకాల మరణంతో సంగీత లోకం శోకసంద్రంలో మునిగిపోయిన వేళ.. ఆయన సంగీతం అందించిన కొన్ని తెలుగు సినిమా ఆణిముత్యాలు మీకోసం..








Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని