Bimbisara: టీజర్‌తో.. ‘బింబిసార’

నందమూరి కల్యాణ్‌రామ్‌ హీరోగా నటిస్తూ.. స్వీయ నిర్మాణంలో రూపొందిస్తున్న చిత్రం ‘బింబిసార’. ఎ టైమ్‌ ట్రావెల్‌ ఫ్రమ్‌ ఈవిల్‌ టు గుడ్‌.. అన్నది ఉపశీర్షిక. వశిష్ట్‌ దర్శకుడు.

Updated : 28 Nov 2021 08:49 IST

నందమూరి కల్యాణ్‌రామ్‌ హీరోగా నటిస్తూ.. స్వీయ నిర్మాణంలో రూపొందిస్తున్న చిత్రం ‘బింబిసార’. ఎ టైమ్‌ ట్రావెల్‌ ఫ్రమ్‌ ఈవిల్‌ టు గుడ్‌.. అన్నది ఉపశీర్షిక. వశిష్ట్‌ దర్శకుడు. కేథరీన్‌, సంయుక్త మేనన్‌ కథానాయికలు. ఈ చిత్ర టీజర్‌ను ఈనెల 29న విడుదల చేయనున్నట్లు శనివారం ప్రకటించారు. ‘‘అతను క్రూరమైన వాడు. బార్బేరియన్‌ కింగ్‌ తన భూభాగాన్ని గుర్తించడానికి వస్తున్నాడు’’ అంటూ చిత్ర బృందం ట్వీట్‌ చేసింది. ఓ చారిత్రక కథాంశంతో తెరకెక్కుతోన్న చిత్రమిది. ఇందులో కల్యాణ్‌రామ్‌ బింబిసార అనే క్రూరమైన రాజుగా శక్తిమంతమైన పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర పనుల్లో ఉన్న ఈ సినిమా.. తెలుగుతో పాటు అన్ని ప్రధాన భారతీయ భాషల్లో విడుదల కానుంది. త్వరలో విడుదల తేదీ ప్రకటించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని