Vijay: 67వ చిత్రం హంగామా

తమిళ అగ్ర కథానాయకుడు విజయ్‌, ‘విక్రమ్‌’ దర్శకుడు లోకేష్‌ కనగరాజ్‌ కలయికలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ‘మాస్టర్‌’ తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Updated : 04 Jan 2023 06:57 IST

తమిళ అగ్ర కథానాయకుడు విజయ్‌ (Vijay), ‘విక్రమ్‌’ దర్శకుడు లోకేష్‌ కనగరాజ్‌ (Lokesh Kanagaraj) కలయికలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ‘మాస్టర్‌’ తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికితోడు త్రిష, సూర్య, సంజయ్‌దత్‌, అర్జున్‌లాంటి భారీ తారాగణంతో రూపొందనుందనే సమాచారంతో అంతటా ఆసక్తి నెలకొంది. ఈ చిత్ర షూటింగ్‌ చెన్నైలోని ఫిల్మ్‌సిటీలో శరవేగంగా సాగుతున్నట్టు నటుడు మనోబాల మంగళవారం సామాజిక మాధ్యమాల్లో ప్రకటించారు. గ్యాంగ్‌స్టర్‌ డ్రామా కథాంశంతో పాన్‌ ఇండియా చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాలో భాగమయ్యామంటూ గౌతమ్‌మేనన్‌, మన్సూర్‌ అలీఖాన్‌ ఇదివరకే తెలిపారు.


అట్లీతో 68వ సినిమా?

విజయ్‌, అట్లీ కలయికలో ఓ కొత్త సినిమా ప్రారంభం కానున్నట్టు సమాచారం. దీనికనుగుణంగా అట్లీ (Atlee) మంగళవారం వికీపీడియా పేజీలో విజయ్‌ 68వ చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్టు మార్పులు చేశారు. ఈ చిత్రం షూటింగ్‌ జూన్‌లో మొదలు కానున్నట్టు తెలుస్తోంది. విజయ్‌, అట్లీల కలయికలో గతంలో ‘థేరి’, ‘మెర్సల్‌’, ‘బిజిల్‌’ సినిమాలు వచ్చాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు