Thalapathy 67: ‘మాస్టర్’లు మళ్లీ కలిశారు.. నిర్మాణ సంస్థ అధికారిక ప్రకటన
విజయ్ హీరోగా దర్శకుడు లోకేశ్ కనగరాజ్ మరో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు నిర్మాణ సంస్థ 7 స్క్రీన్ స్టూడియో ప్రకటించింది.
చెన్నై: ‘మాస్టర్’ చిత్రంతో నటుడు విజయ్ (Vijay)- దర్శకుడు లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) కాంబో కోలీవుడ్, టాలీవుడ్‌లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. వీరిద్దరి కాంబినేషన్‌లో మరో సినిమా తెరకెక్కుతుందనే విషయం తెలిసిందే. దానిపై నిర్మాణ సంస్థ 7 స్క్రీన్ స్టూడియో సోమవారం అధికారిక ప్రకటన ఇచ్చింది. ‘‘మాస్టర్, వారిసు చిత్రాల తర్వాత విజయ్ సర్‌తో మరోసారి కలిసి పనిచేస్తుండడం చాలా సంతోషంగా ఉంది. #Thalapathy67 (వర్కింగ్ టైటిల్)కు లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. జనవరి 2న చిత్రీకరణ ప్రారంభమై, శరవేగంగా జరుగుతోంది. ‘కత్తి’, ‘మాస్టర్’, ‘బీస్ట్’ తర్వాత విజయ్- సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్‌లో కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రమిది. ఈ సినిమాకి ఛాయాగ్రహణం: మనోజ్ పరమహంస, యాక్షన్: అన్బరివ్, ఎడిటింగ్: ఫిలోమిన్‌రాజ్, కొరియోగ్రఫీ: దినేశ్, సంభాషణలు: లోకేశ్ కనగరాజ్, రత్నకుమార్, దీరజ్ వైదీ. ఇతర నటుల వివరాలు త్వరలోనే వెల్లడిస్తాం ’’ అని 7 స్క్రీన్ స్టూడియో టీమ్ ప్రకటనలో తెలిపింది.
కమల్‌హాసన్ హీరోగా గతేడాది తాను తెరకెక్కించిన ‘విక్రమ్’తో లోకేశ్ ‘సినిమాటిక్ యూనివర్స్’ సృష్టించిన సంగతి తెలిసిందే. మరి ఈ చిత్రాన్ని అందులో భాగం చేస్తారా, లేదా? వేచి చూడాల్సిందే. ఇందులో కథానాయికగా త్రిష ఎంపికయ్యారని, బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్, అర్జున్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారని ప్రచారం జరిగింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
AP Govt: ఎవరి గ్లాసు వారే తెచ్చుకోండి.. రాగి జావ పోస్తాం
-
Politics News
Nara Lokesh: ఎమ్మెల్సీ ఎన్నికలు ట్రైలర్ మాత్రమే.. 2024 పూర్తి సినిమా: నారా లోకేశ్
-
Crime News
Andhra News: టిప్పర్ డ్రైవరా మజాకా.. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు సాహసం..
-
Politics News
Botsa: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక చిన్నది: మంత్రి బొత్స
-
Politics News
OTT : ఓటీటీ ప్లాట్‌ఫాంను సెన్సార్ పరిధిలోకి తేవాలి: కూనంనేని
-
Politics News
Payyavula: ‘వై నాట్ 175’ అనే గొంతులు మూగబోయాయి: పయ్యావుల