Thalapathy 67: ఊహించని టైటిల్‌తో వచ్చిన విజయ్‌- లోకేశ్‌ కనగరాజ్‌ కాంబో

విజయ్‌ హీరోగా దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌ తెరకెక్కిస్తోన్న రెండో సినిమా టైటిల్‌ శుక్రవారం ఖరారైంది. ఆ పేరేంటంటే..?

Published : 03 Feb 2023 18:24 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘మాస్టర్‌’ తర్వాత నటుడు విజయ్‌ (Vijay)- దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌ (Lokesh KanagaRaj) కాంబినేషన్‌లో మరో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. #Thalapathy67 అనే వర్కింగ్‌ టైటిల్‌తో ఇటీవల ప్రారంభమైన ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఇందులో నటిస్తున్న ప్రముఖుల వివరాలను వెల్లడించి ఇప్పటికే ఆసక్తి పెంచిన చిత్రబృందం.. తాజాగా టైటిల్‌ ప్రకటించింది. ఈ ఏడాది అక్టోబరు 19న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు తెలిపింది. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేసింది. ఇంతకీ ఈ సినిమా పేరేంటంటే... ‘లియో: బ్లడీ స్వీట్‌’ (Leo: Bloody Sweet).

విజయ్‌ అభిమానుల్లో చాలామంది ఈ సినిమాకు ‘రెడ్‌ కోడ్‌’ అనే పేరు పెట్టుంటారంటూ గురువారం సంబంధిత హ్యాష్‌ట్యాగ్‌ను నెట్టింట వైరల్‌ చేశారు. ఊహించని టైటిల్‌తో ఇప్పుడు సర్‌ప్రైజ్‌ ఫీలవుతున్నారు. ‘లోకేశ్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌’లో భాగంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్‌ సరసన త్రిష (Trisha) నటిస్తున్నారు. బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్‌, అర్జున్‌, ప్రియా ఆనంద్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని