Leo: ‘లియో’ ఆడియో ఫంక్షన్‌ క్యాన్సిల్‌.. అసలు కారణమిదే..

విజయ్‌- లోకేశ్‌ కనగరాజ్‌ కాంబోలో రూపొందిన చిత్రం ‘లియో’ (Leo). దీని ఆడియో రిలీజ్‌ ఈవెంట్‌ను క్యాన్సిల్‌ చేస్తున్నట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది.

Updated : 27 Sep 2023 10:48 IST

చెన్నై: లోకేశ్‌ కనగరాజ్‌ (Lokesh KanagaRaj) దర్శకత్వంలో విజయ్‌ (Vijay) హీరోగా తెరకెక్కిన చిత్రం  ‘లియో’ (Leo). ఈ చిత్రం అక్టోబర్‌ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే కొన్ని రోజుల నుంచి దీని ఆడియో లాంచ్‌ ఈవెంట్‌పై అభిమానుల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. తాజాగా దీనిపై నిర్మాణసంస్థ క్లారిటీ ఇచ్చింది. ఆడియో ఫంక్షన్‌ నిర్వహించడం లేదని స్పష్టం చేసింది.

‘‘ఈ చిత్రం ఆడియో ఈవెంట్‌కు భారీగా అభిమానులు వచ్చే అవకాశముంది. అంతమందికి ఎంట్రీ పాస్‌లు ఇవ్వాలంటే కుదరదు. అందుకే భద్రతా కారణాలతో ఆడియో రిలీజ్‌ ఈవెంట్‌ను రద్దు చేయాలని నిర్ణయించుకున్నాం. అభిమానుల కోసం నిరంతరం ఈ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్‌లను ఇస్తూనే ఉంటాం. అయితే, అందరూ భావిస్తున్నట్లు మా మీద ఏ రాజకీయ పార్టీ ఒత్తడి లేదు. మరే ఇతర కారణాలు లేవు’’ అని ట్వీట్‌ చేసింది. దీంతో విజయ్‌ ఫ్యాన్స్‌ నిరుత్సాహపడుతున్నారు. ‘విజయ్‌ స్పీచ్‌ను మేము మిస్‌ అవుతున్నాం’ అని కామెంట్లు పెడుతున్నారు. అయితే, మొదట ఈ ఈవెంట్‌ను సెప్టెంబర్‌ 30న నిర్వహించాలని అనుకున్న విషయం తెలిసిందే. 

ప్రియమణి విషయంలో మరో రూమర్‌.. స్టార్‌ హీరోకి తల్లిగా!

ఇక ఈ చిత్రం ప్రారంభించిన నాటి నుంచి సోషల్‌ మీడియాలో ఏదో ఓ వార్తతో సందడి చేస్తూనే ఉంది. ఇటీవల విడుదల చేసిన ‘లియో’ పోస్టర్లకు విశేషమైన ప్రేక్షకాదరణ వచ్చింది. అలాగే ఇందులోని ‘నా రెడీ’ పాట కూడా ట్రెండ్‌ క్రియేట్‌ చేసింది.  గ్యాంగ్‌స్టర్‌ డ్రామా కథాంశంతో రూపొందుతోన్న ఈ సినిమాలో త్రిష (Trisha) కథానాయిక. బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ దత్‌, గౌతమ్‌ మేనన్‌, మిస్కిన్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్‌ స్వరాలందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని