Vijay: ‘వారిసు’ చిత్ర నిర్మాతకు జంతు సంక్షేమ బోర్డు నోటీసులు..

విజయ్‌ హీరోగా తెరకెక్కుతున్న ద్విభాష చిత్రం ‘వారిసు’ ఈ సినిమా నిర్మాతకు తాజాగా జంతు సంక్షేమ బోర్డు నోటీసులు జారీ చేసింది. 

Published : 24 Nov 2022 17:40 IST

హైదరాబాద్‌: విజయ్‌ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘వారిసు’. ఈ సినిమాను తెలుగులో ‘వారసుడు’ అనే పేరుతో విడుదల చేయనున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా చిక్కుల్లో పడింది. చిత్ర నిర్మాతకు జంతు సంక్షేమ బోర్డు‌(Animal Welfare Board) నోటీసులు జారీ చేసింది. తమ అనుమతి లేకుండా సినిమా షూటింగ్‌ కోసం ఏనుగులను ఉపయోగించినందుకు అధికారులు నోటీసులు జారీ చేశారు.

నిబంధనల ప్రకారం సినిమాలో జంతువులను ప్రదర్శించినట్లైతే సంబంధిత యాజమాన్యం జంతు సంక్షేమ బోర్డులో నమోదు చేసుకోవాలి. కానీ వారిసు చిత్ర బృందం ఎలాంటి నమోదు చేసుకోకుండా షూటింగ్‌లో ఐదు ఏనుగులను ఉపయోగించారు. ఈ విషయంపై వివరణ కోరుతూ చిత్ర నిర్మాతకు జంతు సంక్షేమ బోర్డు నోటీసులు జారీ చేసింది. ఏడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని కోరింది. లేదంటే తగు చర్యలు తీసుకుంటామని వెల్లడించింది.

ఇక ఈ చిత్రానికి సంబంధించిన క్లైమాక్స్‌ షూట్‌ త్వరలోనే హైదరాబాద్‌లో జరగనున్నట్టు సమాచారం. సాంగ్స్‌ అన్నీ షూట్‌ చేశాక క్లైమాక్స్‌ను మొదలుపెట్టనున్నారు.  డిసెంబర్‌ 5 నాటికి షూటింగ్‌ పూర్తిచేసే పనిలో ఉందట చిత్రబృందం. 2023 సంక్రాంతికి ఈ సినిమాను ప్రేక్షకులకు అందించనున్నారు. అయితే సంక్రాంతి పండుగకు కేవలం తెలుగు చిత్రాలను మాత్రమే తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయాలంటూ తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అది ఈ సినిమా తెలుగులో రిలీజ్‌పై ప్రభావం చూపనుందని భావిస్తున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని