Published : 26 Feb 2022 13:00 IST

Thaman: ‘భీమ్లానాయక్‌’ థియేటర్‌లో తమన్‌ హంగామా.. వీడియో వైరల్‌

హైదరాబాద్‌: పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌, రానా దగ్గుబాటి కీలకపాత్రల్లో నటించిన పవర్‌ప్యాక్డ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘భీమ్లనాయక్‌’. సాగర్‌ కె. చంద్ర దర్శకుడు. ప్రేక్షకుల ఎదురుచూపులకు సమాధానం చెబుతూ శుక్రవారం ఉదయం ఈ సినిమా విడుదలై ఘనవిజయాన్ని అందుకుంది. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా పవన్‌ మేనియా కనిపించింది. చాలా రోజుల తర్వాత పవన్‌కల్యాణ్‌ నుంచి ఇలాంటి కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ రావడంతో ప్రతి సీన్‌ని అభిమానులు ఎంజాయ్‌ చేశారు. ఇక, త్రివిక్రమ్‌ డైలాగ్‌లు, తమన్‌ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ సినిమాని మరోస్థాయికి తీసుకెళ్లాయి.

కాగా, ‘భీమ్లానాయక్‌’ సక్సెస్‌ పట్ల సంగీత దర్శకుడు తమన్‌ సంతోషం వ్యక్తం చేశారు. ఎన్నడూ లేని విధంగా పబ్లిక్‌లో డ్యాన్స్‌ చేసి.. తన ఆనందాన్ని బయటపెట్టారు. శివమణి, రేవంత్, శ్రీకృష్ణ, ధనుంజయ్‌తోపాటు తన బృందంతో కలిసి శుక్రవారం ‘భీమ్లానాయక్‌’ వీక్షించేందుకు ఆయన నగరంలోని ఓ ప్రముఖ థియేటర్‌కు వెళ్లారు. సినిమా చూస్తున్నంతసేపు అభిమానుల నుంచి వచ్చిన రెస్పాన్స్‌ చూసి ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. ఆ వెంటనే స్క్రీన్‌ వద్దకు చేరుకుని శివమణితో కలిసి ‘లాలా భీమ్లా’ పాటకు స్టెప్పులేశారు. దీనికి సంబంధించిన వీడియోని ట్విటర్‌ వేదికగా షేర్‌ చేస్తూ.. ‘‘బ్లాక్‌బస్టర్‌ భీమ్లానాయక్‌... నా నాయకుడు పవన్‌కల్యాణ్‌, గురూజీ త్రివిక్రమ్‌ కోసం ఈ సర్‌ప్రైజ్‌. మీ అందరికీ నచ్చుతుందని భావిస్తున్నా’’ అని ట్వీట్‌ చేశారు.


Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts