
Akhanda: మహేశ్.. ప్రభాస్.. ఎన్టీఆర్ అందరూ ‘భం.. అఖండ’
ఇంటర్నెట్‌డెస్క్: లక్ష ఢమరుకాలు ఒకేసారి మోగితే.. వెయ్యి పిడుగులు ఒకేసారి పడితే.. వంద అణుబాంబులు ఒకేసారి పేలితే.. ఎలా ఉంటుందో తెలియదు గానీ, బహుశా ‘అఖండ’ నేపథ్య సంగీతంలా ఉంటుందేమో. థియేటర్లో ‘అఖండ రుద్ర సికిందర్ అఘోర’గా బాలకృష్ణ వస్తుంటే, అభిమానులు పూనకాలతో ఊగిపోయారు. అందుకు కారణం బోయపాటి టేకింగ్, బాలకృష్ణ ఆహార్యం ఒక ఎత్తైతే తమన్ నేపథ్య సంగీతం మరో ఎత్తు. ఆ ప్రళయకాల రుద్రుడు శివుడేమైనా తమన్‌ను ఆవహించాడా? అన్న రీతిలో థియేటర్లు దద్దరిల్లిపోయేలా సంగీతం అందించాడు. ఇప్పుడు ‘అఖండ’ ఓటీటీలోనూ అదరగొడుతోంది. ఈ నేపథ్యంలో తమన్ నేపథ్య సంగీతాన్ని తీసుకుని అదిరిపోయే మీమ్స్‌తో నెటిజన్లు ట్రెండ్ చేస్తున్నారు. మహేశ్.. ప్రభాస్.. ఎన్టీఆర్ నటించిన సన్నివేశాలు ‘భం.. అఖండ’ అంటూ చూస్తుంటే సరికొత్తగా ఉంది. ఇక తమన్ ఫొటోతో చేసిన రీమిక్స్‌కు ఆయన కూడా ఫిదా అయ్యారు. ‘బ్రో.. నా టీషర్టులో తలపెట్టుకుని దీన్ని చూశాను. వామ్మో.. చాలా బలం కావాలి..’ అంటూ ట్వీట్ చేశారు. ఆ వీడియోలను మీరూ చూసేయండి..