Updated : 11 Aug 2022 13:24 IST

Tollywood Movies: ఈ వసూళ్లు చూసి సంబరాలు చేసుకోకూడదు: తమ్మారెడ్డి భరద్వాజ

హైదరాబాద్‌: ‘‘బింబిసార’, ‘సీతా రామం’ హిట్‌ అయ్యాయని ఆనందపడిపోకూడదు. భవిష్యత్తులో తెరకెక్కించే ప్రతి చిత్రాన్ని మంచి కంటెంట్‌తో రూపొందించాలి. మూడు, నాలుగు రోజుల కలెక్షన్స్‌ చూసి సంబరాలు చేసుకోకూడదు’’ అని ప్రముఖ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. ‘బింబిసార’ను వీక్షించిన ఆయన సినిమా గురించి తన అభిప్రాయాలు పంచుకుంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘బింబిసార’ రెగ్యులర్‌ కమర్షియల్‌ కథేనని.. కొత్త కథేమీ కాదని చెప్పారు. అయితే దర్శకుడు వశిష్ఠ ఈ సినిమాను ఆకట్టుకునేలా తీర్చిదిద్దారని మెచ్చుకున్నారు.

‘బింబిసార’ అనే క్రూరమైన రాజుతో కథ మొదలుపెట్టి టైమ్‌ ట్రావెల్‌లో ఆ రాజు ఎలా సెంటిమెంటల్‌గా మారాడో చూపించారు అని తమ్మారెడ్డి విశ్లేషించారు. అయితే, ఈ చిత్రాన్ని ‘ఆదిత్య 369’తో పోల్చి చూడటం సరైన పద్ధతి కాదన్నారు. ఆ సినిమాకు, ఈ సినిమాకూ ఎలాంటి ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. ‘‘మంచి కంటెంట్‌ ఉంటే ప్రేక్షకులు తప్పకుండా సినిమాని ఆదరిస్తారు. అయితే ఈ విజయాలతో ఆనందపడిపోకుండా సినిమాల రన్‌ పెరిగేలా చూడాలి. థియేటర్లకు రెగ్యులర్‌ ఆడియన్స్‌ పెరగాలి’’ అని సూచించారు తమ్మారెడ్డి.

‘‘50 రోజులపాటు సినిమాలు ఎందుకు థియేటర్లలో ఆడటం లేదు? అసలు ప్రేక్షకులు థియేటర్లకు ఎందుకు రావడం లేదు అనేది ఆలోచించాలి. అప్పుడే మరిన్ని మంచి సినిమాలు వచ్చి థియేటర్లు బతుకుతాయి. సినిమాకు పూర్వ వైభవం సొంతమవుతోంది’’ అని తమ్మారెడ్డి పేర్కొన్నారు.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని