Thank You: నాగ చైతన్య ‘థ్యాంక్యూ’.. ఆ ఓటీటీలోనే స్ట్రీమింగ్‌

నాగ చైతన్య హీరోగా నటించిన ‘థ్యాంక్యూ’ సినిమా ఓటీటీ విడుదల తేదీ ఖరారైంది.

Published : 09 Aug 2022 11:35 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నాగ చైతన్య హీరోగా నటించిన ‘థ్యాంక్యూ’ (Thank You) సినిమా ఓటీటీ విడుదల తేదీ ఖరారైంది. ‘అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో’లో (Amazon Prime Video) ఈ నెల 11 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఈ మేరకు సదరు సంస్థ కొత్త ట్రైలర్‌ను సోషల్‌ మీడియా వేదికగా విడుదల చేసింది. విక్రమ్‌ కె. కుమార్‌ దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్‌ డ్రామా చిత్రంలో నాగ చైతన్య మూడు విభిన్న పాత్రల్లో కనిపించి, ప్రేక్షకులని అలరించారు. ఈ సినిమాలో రాశీఖన్నా, అవికా గోర్‌, మాళవికా నాయర్‌ కథానాయికలుగా సందడి చేశారు. జులై 22న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ఆశించనంత ఫలితాన్ని అందుకోలేకపోయింది.

క‌థేంటంటే: అభిరామ్ (నాగ‌చైత‌న్య) (Naga Chaitanya) పేదింటి కుర్రాడు. చిన్ననాటి నుంచే త‌న‌కంటూ కొన్ని ఆశ‌యాలుంటాయి. త‌న జీవితంలో ఒకొక్క మ‌జిలీ త‌ర్వాత అమెరికా చేరుకుంటాడు. అక్కడ త‌న తెలివితేట‌ల‌తో కార్పొరేట్ సామ్రాజ్యాన్ని సృష్టిస్తాడు. అత‌నితో ప్రియ (రాశీఖ‌న్నా) (Rashi Khanna) ప్రేమలో పడుతుంది. ఇద్దరూ స‌హ‌జీవ‌నం చేస్తారు. జీవితంలో ఎదుగుతున్న కొద్దీ అభి ఆలోచ‌న‌లు మారిపోతాయి. జీవితంలో ఎన్నో వ‌దులుకుని ఇక్కడిదాకా వ‌చ్చా.. రాజీ ప‌డే ప్రస‌క్తే లేదంటూ ఎవ్వరినీ లెక్క చేయ‌డు. నేను, నా ఎదుగుద‌ల అన్నట్టుగానే వ్యవ‌హరిస్తుంటాడు. ఎదుటివాళ్ల మ‌నోభావాల్ని అస్సలు ప‌ట్టించుకోడు. దీంతో ప్రియ అత‌డికి దూరంగా వెళ్లిపోతుంది. అభి అలా  మార‌డానికి దారి తీసిన ప‌రిస్థితులు ఏమిటి? ప్రియ దూర‌మ‌య్యాకైనా అతడి ఆలోచ‌న‌ల్లో మార్పు వచ్చిందా? ఆ తర్వాత ఇండియాకి తిరిగి వ‌చ్చిన అభి ఏం చేశాడన్నదే మిగ‌తా క‌థ‌.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని