సుమకు థ్యాంక్యూ: అనుదీప్‌

‘జాతిరత్నాలు’తో దర్శకుడిగా తొలి ప్రయత్నంలోనే నవ్వుల సందడి నెలకొల్పి.. బాక్సాఫీస్‌ వద్ద హిట్‌ టాక్‌ అందుకున్నారు అనుదీప్‌. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని గురువారం విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి...

Updated : 12 Mar 2021 17:31 IST

హైదరాబాద్‌: ‘జాతిరత్నాలు’తో దర్శకుడిగా నవ్వుల సందడి నెలకొల్పి.. బాక్సాఫీస్‌ వద్ద హిట్‌ టాక్‌ అందుకున్నారు అనుదీప్‌. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని గురువారం విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ‘జాతిరత్నాలు’ చిత్రానికి ‘క్యాష్‌’ ప్రోగ్రామ్‌ వల్ల బాగా ప్రమోషన్‌ లభించిందని దర్శకుడు అనుదీప్‌ తాజాగా వెల్లడించారు.

‘జాతిరత్నాలు’ విజయోత్సవంలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనుదీప్‌.. ‘థియేటర్లలో ‘జాతిరత్నాలు’ సినిమా చూసి ప్రేక్షకులు బాగా నవ్వుకోవాలనే ఉద్దేశంతోనే ఇన్నాళ్లూ మా సినిమా విడుదలను వాయిదా వేశాం. మా సినిమా విడుదలయ్యాక స్పందన ఎలా ఉందో చూద్దామని నగరంలోని కొన్ని థియేటర్లకు వెళ్లాం. ప్రేక్షకులు పడి పడి నవ్వుతున్నారు. వాళ్ల ఆనందాన్ని చూస్తే మాకు ముచ్చటగా అనిపించింది. అయితే సినిమా విడుదలకు కొన్నిరోజుల ముందు మేము ఈటీవీలో ప్రసారమయ్యే ‘క్యాష్‌’కు వెళ్లాం. సుమ గారి వల్ల నాకూ, మా చిత్రానికి విడుదలకు ముందే మంచి గుర్తింపు లభించింది. థ్యాంక్యూ సుమ.’’ అని అనుదీప్‌ వెల్లడించారు.

అంతేకాకుండా తనకి అన్ని రకాల జానర్లలో సినిమా చేయాలని ఉందని.. ప్రస్తుతం లవ్‌, రొమాంటిక్‌ కథను సిద్ధం చేస్తున్నానని ఆయన అన్నారు. ఇక ‘జాతిరత్నాలు’ విషయానికి వస్తే.. నవీన్‌ పొలిశెట్టి, రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో నటించారు. ఫ‌రియా అబ్దుల్లా కథానాయిక. ప్రముఖ దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ నిర్మాత.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని