Thank You: విభిన్న లుక్స్‌తో నాగచైతన్య.. హత్తుకునేలా ‘థ్యాంక్‌ యూ’ టీజర్‌

నాగచైతన్య పలు విభిన్న లుక్స్‌లో కనిపించనున్న చిత్రం ‘థ్యాంక్‌ యూ’ . రాశీఖన్నా, అవికాగోర్‌, మాళవిక నాయర్‌ కథానాయికలు.

Published : 25 May 2022 17:07 IST

ఇంటర్నెట్‌ డెస్క్: నాగచైతన్య (Naga Chaitanya) పలు విభిన్న లుక్స్‌లో కనిపించనున్న చిత్రం ‘థ్యాంక్‌ యూ’ (Thank You). రాశీఖన్నా, అవికాగోర్‌, మాళవిక నాయర్‌ కథానాయికలు. విక్రమ్‌ కె. కుమార్‌ (Vikram Kumar) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం జులై 8న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం టీజర్‌ను విడుదల చేసింది. విభిన్న ప్రేమకథతో ఈ సినిమా రూపొందుతున్నట్టు ప్రచార చిత్రంలో చూపించిన సన్నివేశాలు చూస్తే అర్థమవుతోంది. క్లాస్‌, మాస్‌ గెటప్‌లో చైతన్య కనిపించిన తీరు అందరినీ ఆకట్టుకునేలా ఉంది. ప్రతి సంభాషణలోనూ విక్రమ్‌ కుమార్‌ మార్క్‌ కనిపిస్తుంది. తమన్‌ అందించిన నేపథ్య సంగీతం వినసొంపుగా ఉంది. ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు, శిరీష్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సూపర్‌హిట్‌ చిత్రం ‘మనం’ తర్వాత విక్రమ్‌- చైతన్య కాంబినేషన్‌లో వస్తుండటంతో ‘థ్యాంక్‌ యు’ (#ThankYouTeaser)పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని