Thar trailer: ఆసక్తికరంగా ‘థార్‌’ ట్రైలర్‌.. తెరపై తండ్రీ కొడుకులు

బాలీవుడ్‌ నటుడు అనిల్‌ కపూర్‌, ఆయన తనయుడు హర్షవర్థన్‌ కపూర్‌ తెరపై సందడి చేసేందుకు సిద్ధమయ్యారు.

Updated : 18 Apr 2022 19:04 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: బాలీవుడ్‌ నటుడు అనిల్‌ కపూర్‌, ఆయన తనయుడు హర్షవర్థన్‌ కపూర్‌ తెరపై సందడి చేసేందుకు సిద్ధమయ్యారు. రాజేశ్‌ సింగ్‌ చౌదరి దర్శకత్వంలో వీరిద్దరూ కలిసి నటిస్తున్న డార్క్‌ క్రైమ్‌ డ్రామా ‘థార్‌’. సోమవారం ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇందులో అనిల్‌ పోలీస్‌ అధికారిగా కనిపించగా, హర్షవర్థన్‌ అరుదైన వస్తువులను అమ్మి సొమ్ముచేసుకునే వ్యక్తి పాత్రలో కనిపించారు.  థార్‌ ప్రాంతంలో జరిగే వరుస హత్యలకు, హర్షవర్థన్‌కు సంబంధం ఉందా? పోలీస్‌ అధికారిక అయిన అనిల్‌ కపూర్‌ వాటిని ఎలా చేధించడాన్నది ఈ చిత్ర కథ. ప్రముఖ ఓటీటీ నెట్‌ప్లిక్స్‌ ఈసినిమాను నిర్మిస్తోంది. మే 6వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఈ సందర్భంగా అనిల్‌ కపూర్‌ మాట్లాడుతూ.. షూటింగ్‌ సమయంలో తాను కొన్ని సూచనలు చేశానని, కానీ, వాటిని హర్షవర్థన్‌ తిరస్కరించాడని చెప్పారు. హర్ష తీసుకున్న నిర్ణయమే సరైనదని తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని