Tiger shroff-Disha patani: ఆ రూమర్స్‌తో మా ఆరేళ్ల బంధాన్ని విడదీయలేరు!

దాదాపు ఆరేళ్లుగా సహజీవనం చేస్తున్న టైగర్‌ష్రాఫ్(Tiger Shroff)‌, దిశాపటానీ(Disha Patani) జంట మధ్య విభేదాలు వచ్చాయంటూ ఇటీవల బాలీవుడ్‌ మీడియాలో విపరీతంగా ప్రచారం జరిగింది. వీరిద్దరు..

Updated : 16 Aug 2022 19:14 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దాదాపు ఆరేళ్లుగా సహజీవనం చేస్తోన్న టైగర్‌ష్రాఫ్(Tiger Shroff)‌, దిశాపటానీ(Disha Patani) జంట మధ్య విభేదాలు వచ్చాయంటూ ఇటీవల బాలీవుడ్‌ మీడియాలో ప్రచారం జరిగింది. వీరిద్దరూ ఎవరి పని వాళ్లు చూసుకుంటున్నారనీ.. గతంలో ఉన్న ఆ సఖ్యత ఇప్పుడు లేదనీ.. ఫిట్‌నెస్‌కు అధిక ప్రాధాన్యం ఇచ్చే టైగర్‌ విధానం దిశాకు నచ్చట్లేదంటూ రకరకాల కారణాలను మీడియా చెప్పుకొచ్చింది. అయితే.. అవన్నీ రూమర్లేనంటూ టైగర్‌, దిశా సన్నిహితులు తాజాగా కొట్టిపారేశారు. మీడియాకు వారిచ్చిన సమాచారం ప్రకారం..

‘దిశా రోజూ టైగర్‌ ఇంట్లో ఉన్న జిమ్‌కు వెళ్తుంది. వాళ్లింట్లో అందరికీ దిశా అంటే ఇష్టం. వీరి బంధంపై జాకీష్రాఫ్‌ కూడా సుముఖంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఇంకా ఈ బ్రేకప్‌ గాసిప్స్‌ విషయాన్ని ఆ జంట వద్ద సన్నిహితులు ప్రస్తావించగా ‘ఈ రూమర్స్‌తో మా ఆరేళ్ల బంధాన్ని విడదీయలేరు’ అని వారు అన్నారట. ఇక వీరిద్దరి బంధంపై ఇటీవల జాకీష్రాఫ్‌ను(Jackie Shroff) మీడియా ప్రశ్నించగా..‘టైగర్‌ వ్యక్తిగత జీవితంపై నేను మాట్లాడను. ఇక దిశా మా ఇంట్లో అమ్మాయే’ అంటూ సమాధానమిచ్చారు. చాలా కాలంగా సహజీవనంలో ఉన్న వీరిద్దరూ ఈ ఏడాది పెళ్లి పీటలెక్కుతున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే.. అంతలోనే బ్రేకప్‌ వార్తల ప్రచారం జరగడంతో వారి సన్నిహితులు స్పందించారు.

ఇక వీరి కెరీర్ విషయానికొస్తే  టైగర్‌ష్రాఫ్‌ హీరోగా నటించిన ‘గణపత్‌’(Ganapath) అనే యాక్షన్‌ థ్రిల్లర్‌ ఈ సంవత్సరం డిసెంబరు 23న విడుదలవనుంది. అమితాబ్‌ బచ్చన్‌(Amitabh Bachchan) కీలకపాత్ర పోషించిన ఈ చిత్రంలో కృతిసనన్‌ కథానాయిక. ఇదే కాకుండా ఇంకో రెండు సినిమాలు చిత్రీకరణ జరుపుకొంటున్నాయి. అందులో ఒకటి అక్షయ్‌ కుమార్‌తో(Akshay Kumar) నటిస్తున్న ‘బడేమియా చోటేమియా’(Bade Miyan Chote Miyan) కాగా మరొకటి ‘స్క్రూ ఢీలా’ అనే యాక్షన్‌ థ్రిల్లర్‌. ఈ రెండు 2023లో విడుదలయ్యే అవకాశం ఉంది. ఇక దిశాపటానీ ‘యోధ’(Yodha) అనే చిత్రంలో సిద్ధార్థ్‌ మల్హోత్ర(Sidharth Malhotra) సరసన నటిస్తోంది. భారీ పాన్‌ ఇండియా చిత్రం ‘ప్రాజెక్ట్‌ కే’(Project K) లోనూ ఈమె ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని