Salaar: ఆదిపురుష్‌ ఎఫెక్ట్‌.. సలార్‌ కూడా వాయిదా తప్పదా..!

ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్‌ సినిమా వాయిదా వేస్తున్నట్లు ఇటీవల చిత్రబృందం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రభావం ప్రభాస్‌ నటిస్తున్న మరో పాన్‌ ఇండియా చిత్రంపై పడనుందని అది కూడా వాయిదా వేయనున్నారని అనుకుంటున్నారు ఫ్యాన్స్‌. 

Published : 08 Nov 2022 11:09 IST

హైదరాబాద్‌: ప్రస్తుతం ప్రభాస్‌(Prabhas) అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమాలు ఆదిపురుష్(Adipurush)‌, సలార్(Salaar)‌. తాజాగా ఆదిపురుష్‌ సినిమాను వాయిదా వేస్తున్నట్లు దర్శకుడు ఓంరౌత్‌(Om Raut) ప్రకటించిన విషయం తెలిసిందే. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్‌ కొందరిని నిరాశ పరచడంతో చిత్రబృందం ఈ చిత్రాన్ని మెరుగ్గా తీర్చిదిద్దడం కోసం మరికొంత సమయం తీసుకోనుంది. ఆ కారణంతోనే ఈ సినిమా విడుదలను వచ్చే ఏడాది జూన్‌కు వాయిదా వేశారు. అయితే ప్రభాస్‌ ఫ్యాన్స్‌ను మరో వార్త కలవరపెడుతోంది. సలార్‌ చిత్రం కూడా వాయిదా పడనుందనే వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ విషయంపై అధికారిక ప్రకటన రాలేదు.. కానీ దాదాపు వాయిదా పడినట్లే సమాచారం.

ఇక సలార్‌ సినిమాను వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో విడుదల చేస్తామని చిత్రబృందం గతంలో ప్రకటించింది. అయితే తాజాగా ఆదిపురుష్‌ వాయిదా పడడంతో దాని ప్రభావం సలార్‌ సినిమా పై పడనుందని.. అందుకే ఈ సినిమాను కూడా వాయిదా వేసే అవకాశాలు ఉన్నాయని టాక్‌. ఈ రెండు సినిమాలు భారీ బడ్జెట్‌వి కావడంతో విడుదల ఆలస్యం అయినా.. అభిమానుల అంచనాలకు తగ్గట్లు ఉండేలా ప్లాన్‌ చేస్తున్నారు దర్శకనిర్మాతలు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని