Published : 07 Jan 2022 22:24 IST

Prince Cecil: ‘క్లైమాక్స్‌ ట్విస్ట్‌ ప్రారంభంలోనే వచ్చింది’.. ఆసక్తిగా ‘అమెరికన్‌ డ్రీమ్‌’ ట్రైలర్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘ఎదగడానికి అమెరికా వచ్చిన నాకు బతకడమే కష్టమైపోయింది’ అని అంటున్నారు యువ నటుడు ప్రిన్స్‌. అమెరికా నేపథ్యంలో ఆయన నటించిన ఓటీటీ చిత్రం ‘ది అమెరికన్‌ డ్రామా’లోని సంభాషణ ఇది. శుక్రవారం ఈ సినిమా ట్రైలర్‌ విడుదలైంది. ‘క్లైమాక్స్‌లో రావాల్సిన ట్విస్ట్‌ కథ స్టార్టింగ్‌లోనే వచ్చింది. ఆశతో వచ్చిన నాకు అమెరికా అసలు రంగేంటో అర్థమైంది’ అనే డైలాగ్‌తో ప్రారంభమైన ట్రైలర్‌ ఆద్యంతం ఆసక్తిగా సాగింది. డబ్బు సంపాదించటం కోసం అమెరికాలో ఎదురయ్యే కష్టాల గురించి ఈ సినిమాలో చూపించబోతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాకి విఘ్నేశ్‌ కౌశిక్‌ దర్శకత్వం వహించారు. నేహా కథానాయిక. ఈ చిత్రం జనవరి 14 నుంచి ‘ఆహా’ ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది.


Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని