ఏప్రిల్ 8న విడుదల కానున్న ‘ది బిగ్‌ బుల్‌’

అభిషేక్‌ బచ్చన్‌, ఇలియానా కలిసి నటిస్తున్న చిత్రం ‘ది బిగ్‌ బుల్‌’. కూకీ గులాటి దర్శకత్వంలో తెరకెక్కుతుంది. 1980 నుంచి 1990 కాలంలో స్టాక్ బ్రోకర్ హర్షద్ మెహతా జీవితంతో పాటు ఆర్థిక నేరాలకు పాల్పడటం ఆధారంగా చిత్రం రూపొందించారు. 

Updated : 10 Dec 2021 13:28 IST

ముంబయి: అభిషేక్‌ బచ్చన్‌, ఇలియానా కలిసి నటిస్తున్న చిత్రం ‘ది బిగ్‌ బుల్‌’. కూకీ గులాటి దర్శకత్వంలో తెరకెక్కుతుంది. 1980-1990 కాలంలో స్టాక్ బ్రోకర్ హర్షద్ మెహతా పాల్పడిన ఆర్థిక నేరాల ఆధారంగా చిత్రం రూపొందించారు. చిత్రాన్ని ఏప్రిల్‌ 8న డిస్నీ + హాట్‌ స్టార్‌లో విడుదల చేయనున్నారు. ఈ నెల 19న ట్రైలర్‌ విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

అజయ్‌ దేవగణ్‌ ఫిల్మ్స్, ఆనంద్‌ పండిట్‌ మోషన్‌ పిక్చర్స్ కలిసి సంయుక్తంగా నిర్మించారు. సెప్టెంబర్ 16, 2019న ప్రారంభమైన ఈ చిత్రం షూటింగ్‌ కోవిడ్‌ కారణంగా వాయిదా పడింది. థియేటర్లో ఈ సినిమాని విడుదల చేయడం లేదు. ఇందులో నికితా దత్తా, వరుణ్‌ శర్మ, చుంకీ పాండే, లేఖ ప్రజాపతి, కుముద్‌ మిశ్రా తదితరులు నటిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని