Acharya: ‘ధర్మస్థలి’ పిలుస్తోంది

మెగా అభిమానులకు మరో సర్‌ప్రైజ్‌ ఇచ్చింది ‘ఆచార్య’ చిత్ర యూనిట్‌. మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆచార్య’లో రామ్‌చరణ్‌ కీలకపాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. కాగా.. అభిమానుల కోసం చరణ్‌ కొత్తలుక్‌ విడుదల చేశారు.

Published : 10 Jul 2021 16:40 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మెగా అభిమానులకు మరో సర్‌ప్రైజ్‌ ఇచ్చింది ‘ఆచార్య’ చిత్ర యూనిట్‌. మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆచార్య’లో రామ్‌చరణ్‌ కీలకపాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. కాగా.. అభిమానుల కోసం నిర్మాణ సంస్థ చరణ్‌ కొత్తలుక్‌ విడుదల చేసింది. ‘ధర్మస్థలి(ఆలయ సెట్‌)కి ద్వారం తెరచుకుంది. చివరి షెడ్యూల్‌లో ఉన్నాం’ అంటూ అందులో పేర్కొంది. అంతేకాదు త్వరలోనే మరో సర్‌ప్రైజ్‌ కూడా ఉండబోతోందని ప్రకటించింది.

కరోనా ఉద్ధృతి వల్ల నిలిచిపోయిన ఈ చిత్ర షూటింగ్‌ ఇటీవల మళ్లీ ప్రారంభమైంది. త్వరలోనే సినిమా చిత్రీకరణతో పాటు పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు పూర్తి చేయనున్నారు. ఇక ప్రేక్షకుల ముందుకు రావడమే తరువాయి. కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇందులో చిరంజీవి ఆచార్యగా కనిపించనుండగా రామ్‌చరణ్‌ సిద్ధ పాత్ర పోషించాడు. కాజల్‌ నాయిక. రామ్‌చరణ్‌, పూజా హెగ్డే కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు