Malaika Arora: మలైక ‘ఎస్‌’ అన్నందుకు హీరోతో వివాహమనుకున్నారు.. కానీ

మలైక అరోరా పెట్టిన ఓ పోస్ట్‌ నెట్టింట చర్చనీయాంశమైంది. ఆమె ఏం చెప్పింది? నెటిజన్లు ఏం అనుకున్నారంటే?

Published : 11 Nov 2022 01:19 IST

ముంబయి: డబ్బులివ్వకుండా షాప్‌లోని షూస్‌ ఎలా తీసుకోవాలో ‘మన్మథుడు’ చిత్రంలో నాగార్జున వివరిస్తుంటే.. ‘ఈమాత్రం హింట్‌ ఇస్తే చాలు సర్‌ చెలగేరిపోతా’ అంటూ బ్రహ్మానందం పంచిన వినోదం గుర్తుందిగా! నెట్టింట ప్రస్తుతం అలాంటి సందడే నెలకొంది. ఏమైందంటే.. బాలీవుడ్‌ నటి మలైకా అరోరా (Malaika Arora) ‘నేను ఓకే చెప్పా’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో లవ్‌ ఎమోజీలు జతచేశారు. దేనికి? ఎవరికి? అనే వివరాలేవీ ఆమె పంచుకోలేదు. పెళ్లికి సిద్ధమయ్యానని ఆమె తమకేదే హింట్‌ ఇచ్చినట్టు భావించిన ఎంతోమంది నెటిజన్లు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేశారు. మలైక, అర్జున్‌కపూర్‌లు కలిసి ఉన్న ఫొటోలను షేర్‌ చేశారు.

కొంతకాలంగా హీరో అర్జున్‌ కపూర్‌తో మలైక ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. అర్జున్‌తో పెళ్లికి మలైక అంగీకరించిందంటూ ఆమె పెట్టిన పోస్ట్‌ను ఆధారంగా చేసుకుని పలు వెబ్‌సెట్లు వార్తలు రాశాయి. సినీ ప్రముఖులూ మలైకకు కంగ్రాట్స్‌ చెప్పడం గమనార్హం. అలా ఆ న్యూస్‌, అభిమానుల పోస్ట్‌లతో #malaika అనే హ్యాష్‌ట్యాగ్‌ కొంతసేపు ట్విటర్‌ ట్రెండింగ్‌ జాబితాలో నిలిచింది. ‘ఇది ఇంకెక్కడికి దారి తీస్తుందో’ అని అనుకున్న మలైక  అసలు విషయాన్ని బయట పెట్టారు. ‘నేను ఎస్‌ అని చెప్పింది ఓటీటీ డిస్నీ+ హాట్‌స్టార్‌ సంస్థకు. ఆ ఓటీటీ నిర్మిస్తున్న రియాలిటీ షోకు నేను హోస్ట్‌గా వ్యవహరిస్తున్నా. ‘మూవింగ్‌ విత్‌ మలైక’ అనే ఆ కార్యక్రమం డిసెంబరు 5 నుంచి ప్రసారమవుతుంది’’ అని మలైక వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని