Chellam sir: చెల్లమ్ సర్ వెనక కథేంటీ?
‘ చెల్లమ్ సర్’ ఫ్యామిలీ మ్యాన్ రెండో సీజన్ వచ్చాక ఇంటర్నెట్లో విపరీతంగా ట్రెండ్ అవుతున్న పదం.
నెట్డ్టింటిలో ట్రెండ్ అవుతున్న పదం
‘చెల్లమ్ సర్’ ఫ్యామిలీ మ్యాన్ రెండో సీజన్ వచ్చాక ఇంటర్నెట్లో విపరీతంగా ట్రెండ్ అవుతున్న పదం. మీమ్స్, జోక్స్, ట్వీట్స్‌తో నెట్టింటిలో ఎక్కడ చూసినా ఆ పేరే కనిపిస్తోంది. ఆ పాత్ర కనిపించేది నాలుగు సన్నివేశాల్లోనే అయినా విపరీతమైన క్రేజ్ సంపాదించింది. టీకా అవగాహన కార్యక్రమాల్లోనూ ఈ పాత్రను ఉదహరిస్తున్నారంటే ఎంతలా ప్రాచుర్యం పొందిందో అర్థం చేసుకోవచ్చు. కొందరైతే మానవ సెర్చింజన్ అని గూగుల్‌తో పోల్చుతున్నారు. దేశవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించిపెట్టిన ఆ పాత్రలో నటించే అవకాశం ఉదయ్ మహేశ్‌కు ఎలా వచ్చింది? ‘చెల్లమ్’ వెనుకున్న ఆ కథేంటో చూద్దాం..
కేవలం పదిహేను నిమిషాల నిడివి ఉన్న పాత్రకు ఇంత ఆదరణ లభిస్తుందని ఊహించలేదంటున్నాడు ఉదయ్ మహేశ్. ‘ఆఫీస్’ అనే తమిళ సీరియల్ ద్వారా సుపరిచితడైన ఈ నటుడికి ఇప్పుడు ‘చెల్లమ్ సర్’ పాత్రతో దేశవ్యాప్తంగా పేరొచ్చింది. ఈయన దర్శకుడు కూడా. ‘నాలై’, ‘చక్కర వియుగమ్’ సినిమాలను తెరకెక్కించారు. నటుడిగా ‘ముదర్ కూడమ్’ సినిమాతో 2013లో తెరంగేట్రం చేశారు. ఇప్పటి వరకు 30కి పైగా చిత్రాల్లో నటించారు. నిజానికి సీనియర్ ఆఫీసర్ దీపన్ పాత్రకోసం ఉదయ్ మహేశ్ ఆడిషన్ ఇచ్చారు. కానీ, ఎంపికవ్వలేదు. ఆ పాత్రలో నటించేందుకు మరో నటుడు అళగమ్ పెరుమాళ్‌ను తీసుకున్నారు. దీంతో కాస్త నిరాశ చెందాడు. తన కోసం ఓ బ్రహ్మండమైన పాత్ర ఎదురు చూస్తుందని అప్పుడాయనకు తెలియదు. ‘ఆడిషన్ అయిపోయిన కొన్ని నెలల తర్వాత చెల్లమ్ పాత్రలో నటించాలని ఫోన్ వచ్చింది. మొదటి సీజన్ ఎంతగా హిట్ అయిందో తెలిసిందే. దీంతో రెండో సీజన్లో భాగం కావాలని ఉండేది. దర్శకుల నుంచి ఫోన్ రాగానే నటించేందుకు ఒప్పుకొన్నాను. షూటింగ్ లొకేషన్‌కు వెళ్లి కలిస్తే ముప్పై నిమిషాల్లోనే నా పాత్ర ఎలా ఉండబోతుందో చెప్పేశారు. హీరోకి ఏ సందేహాన్నైనా తీర్చే సూపర్ స్పైగా నా పాత్ర ఉంటుందని వివరించారు. పాత్ర తీరుతెన్నులపై కొన్ని సూచనలిచ్చారు. వారు చెప్పింది చెప్పినట్లు చేశానంతే. చిత్రీకరణ సమయంలో దీనికి ఇంత పేరొస్తుందని ఊహించలేదు. ప్రేక్షకులకు ఏది నచ్చుతుందో దర్శకులకు ముందే తెలిస్తే అన్ని హిట్టే అవుతాయి’ అని ఉదయ్ మహేశ్ చెప్పుకొచ్చారు.
చెల్లమ్ అంటే..?
తమిళంలో ‘చెల్లమ్’ అంటే డార్లింగ్ అనే అర్థం. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ప్రియమైన వారిని ప్రేమగా పిలుచుకునే సందర్భంలో ఈ పదాన్ని వాడతారు. ‘ప్రకాశ్ రాజ్ ద్వారా ఈ పదం బాగా ప్రాచుర్యం పొందింది. తమిళ చిత్రం ‘గిల్లీ’లో త్రిష తెరపై కనిపించినా ప్రతిసారి ముద్దుగా చెల్లమ్ అనే పిలుస్తాడు. ఆ పదంలోనే ఒక రకమైన ఆకర్షణ ఉంటుంది. నా పాత్రకు ఈ పేరే పెట్టడానికి ప్రేరణ ఏంటో తెలియదు కానీ, ఇది ఆ పాత్ర పూర్తి పేరు కాకపోవచ్చు. గూఢచారి కాబట్టి తన వ్యక్తిగత వివరాలు గోప్యంగా ఉంచేందుకు చెల్లమ్ అనే మారు పేరు పెట్టి ఉంటారు’ అని చెప్పుకొచ్చారు ఉదయ్ మహేశ్.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Sundaram Master: ఓటీటీలోకి ‘సుందరం మాస్టర్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
థియేటర్లలో సందడి చేసిన ‘సుందరం మాస్టర్’ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. -
Hanuman: మరో మైలురాయిని దాటిన ‘హనుమాన్’.. ఓటీటీలోనూ కొనసాగుతోన్న హవా
‘హనుమాన్’ సినిమా ఓటీటీలో మరో మైలు రాయిని దాటింది. -
Operation Valentine: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన ‘ఆపరేషన్ వాలెంటైన్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
వరుణ్ తేజ్ (Varun Tej) - మానుషి చిల్లర్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’ (Operation Valentine). -
Fighter: ఓటీటీలోకి యాక్షన్ హంగామా ‘ఫైటర్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
హృతిక్ రోషన్ నటించిన ‘ఫైటర్’ ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. -
Mirzapur 3: ‘మీర్జాపూర్ 3’ ఫస్ట్‌లుక్ రిలీజ్.. గుడ్డూ భయ్యా ఈజ్ బ్యాక్..
‘మీర్జాపూర్ 3’ ఫస్ట్‌లుక్ పోస్టర్ సినీ ప్రియుల్ని ఆకట్టుకుంటోంది. -
New Movies and Series: ఓటీటీలో ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ ‘కాంతారా2’, ‘ఫ్యామిలీస్టార్’.. అమెజాన్ ప్రైమ్ క్రేజీ అప్డేట్స్
Amazon Prime Video: అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా సందడి చేయబోయే సినిమాల జాబితాను సదరు ఓటీటీ సంస్థ పంచుకుంది. -
Citadel: సమంత, వరుణ్‌ధావన్ ‘సిటడెల్’ ఇండియన్ సిరీస్ టైటిల్ ఇదే!
Citadel Honey Bunny: సమంత, వరుణ్‌ధావన్ కలిసి నటించిన ‘సిటడెల్’ ఇండియన్ వెర్షన్ టైటిల్‌ను ప్రకటించారు. -
Hanu Man: ఓటీటీలో ‘హనుమాన్’ క్రేజ్ మామూలుగా లేదుగా.. 2024లో ఇదో సరికొత్త రికార్డు
Hanuman ott: జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్కు వచ్చిన హనుమాన్ మూవీ రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతోంది. -
Hanuman OTT: ఎదురుచూపులకు ఫుల్స్టాప్.. ‘హనుమాన్’ తెలుగు వెర్షన్ రిలీజ్
‘హనుమాన్’ చిత్రం ఎట్టకేలకు ఓటీటీలో విడుదలైంది. -
Bhoothaddam Bhaskar Narayana: ఓటీటీలోకి వచ్చేస్తోన్న కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!
ఇటీవల విడుదలై ప్రేక్షకులను అలరించిన ‘భూతద్దం భాస్కర్ నారాయణ’ ఓటీటీలోకి వచ్చేస్తోంది. -
Inspector Rishi: ఓటీటీలోకి మరో హారర్ క్రైమ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!
నవీన్ చంద్ర నటించిన తాజా వెబ్ సిరీస్ ‘ఇన్స్పెక్టర్ రిషి’. దీని విడుదల తేదీని తాజాగా ప్రకటించారు. -
ETV Win: ఈటీవీ విన్లో ‘ఏం చేస్తున్నావ్?’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
ఈటీవీ విన్ ప్రేక్షకులను అలరించేందుకు మరో యూత్‌ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ వచ్చేస్తోంది. -
Oscars 2024: ఆస్కార్ గెలిచిన సినిమాలు.. స్ట్రీమింగ్ ఇక్కడే..
ఆస్కార్ బరిలో పోటీపడి గెలుపొందిన సినిమాలు ఏ ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్నాయోనని తెగ వెతికేస్తున్నారు. -
Main Atal Hoon: ఓటీటీలో వాజ్‌పేయీ బయోపిక్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Main Atal Hoon: పంకజ్ త్రిపాఠి కీలక పాత్రలో నటించిన ‘మై అటల్ హూ’ ఓటీటీలో స్ట్రీమింగ్కు సిద్ధమైంది. -
Narakasura: ఓటీటీలో రక్షిత్ ‘నరకాసుర’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
రక్షిత్ అట్లూరి కథానాయకుడిగా నటించిన ‘నరకాసుర’ ఓటీటీలోకి వచ్చేసింది. -
Netflix: నెట్‌ఫ్లిక్స్‌లో ‘షీనా బోరా హత్య’ డాక్యుమెంటరీ సంచలనం.. 18 దేశాల్లో ట్రెండింగ్..
‘ది ఇంద్రాణీ ముఖర్జియా స్టోరీ: ది బరీడ్ ట్రూత్’ 18 దేశాల్లో ట్రెండింగ్‌లో ఉంది. -
ooru peru bhairavakona ott: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన ‘ఊరు పేరు భైరవకోన’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ooru peru bhairavakona ott release date: సందీప్ కిషన్ నటించిన ‘ఊరు పేరు భైరవకోన’ మహాశివరాత్రి సందర్భంగా ఓటీటీలో విడుదలైంది. -
merry christmas ott: ఓటీటీలో ‘మెర్రీ క్రిస్మస్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Merry Christmas ott release date: కత్రినాకైఫ్, విజయ్ సేతుపతి కీలక పాత్రల్లో నటించిన ‘మెర్రీ క్రిస్మస్’ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమైంది. -
OTT: ఓటీటీల వల్ల దర్శకులకు ఈ టెన్షన్ తగ్గింది: రాజ్ అండ్ డీకే
దర్శకులు రాజ్ అండ్ డీకే ఓటీటీలపై వారి అభిప్రాయాలను పంచుకున్నారు. -
Bramayugam ott: ఓటీటీలో ‘భ్రమయుగం’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
bramayugam ott release date: మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించిన ‘భ్రమయుగం’ ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమైంది. -
12th Fail: ఓటీటీలోకి ‘12th ఫెయిల్’ తెలుగు వెర్షన్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!
దేశవ్యాప్తంగా విశేష ఆదరణ సొంతం చేసుకున్న ‘12th ఫెయిల్’ చిత్రం తెలుగు వెర్షన్ ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్, ముంబయి మ్యాచ్‌లో నమోదైన రికార్డులివీ..
-
రాశీఖన్నా ‘గోల్డెన్’ మెరుపులు.. అలా చూడొద్దన్న కేతిక.. టీమ్‌తో కృతి సనన్
-
లీడర్ పిలిస్తే.. జనసేన పార్టీ ప్రచారానికి సిద్ధంగా ఉన్నా: నటి అనసూయ
-
నా దగ్గర అంత డబ్బు లేదు.. అందుకే పోటీ చేయట్లేదు: నిర్మలా సీతారామన్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/03/2024)
-
మాల్దీవుల్లో తాగునీటి కొరత.. టిబెట్ నుంచి 1500 టన్నుల నీరు పంపిన చైనా