The Ghost: నాగార్జున ఇన్ని తుపాకులు వాడారా? ఆసక్తిగా ‘ది ఘోస్ట్‌’ వీడియో

ఒకట్రెండు కాదు పలు విభిన్న తుపాకులను శత్రువులపై గురిపెట్టారు ప్రముఖ నటుడు నాగార్జున. నిజ జీవితంలో కాదులేండి..

Published : 23 Sep 2022 02:25 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఒకట్రెండు కాదు పలు విభిన్న తుపాకులను శత్రువులపై గురిపెట్టారు ప్రముఖ నటుడు నాగార్జున (Akkineni Nagarjuna). నిజ జీవితంలో కాదులేండి.. ‘ది ఘోస్ట్‌’ (The Ghost) సినిమా కోసం ఆయన అలా చేశారు. నాగార్జున హీరోగా దర్శకుడు ప్రవీణ్‌ సత్తారు తెరకెక్కించిన చిత్రమిది. దసరా కానుకగా అక్టోబరు 5న విడుదలకానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ‘ది ఘోస్ట్‌: గన్స్‌ అండ్‌ స్వార్డ్స్‌’ పేరుతో ఓ ప్రత్యేక వీడియో పంచుకుంది. ఈ సినిమాలో నాగార్జున, కథానాయిక సోనాల్‌ చౌహాన్‌ ఇంటర్‌పోల్‌ అధికారులుగా నటించిన సంగతి తెలిసిందే. పాత్రలకు తగ్గట్టు వారెలా సన్నద్ధమయ్యారో ఈ వీడియోలో చూడొచ్చు.

ఏ తుపాకీని ఎలా పట్టుకోవాలి? దాన్నెలా గురి పెట్టాలి? తదితర అంశాలను శిక్షకుల దగ్గర నాగ్‌, సోనాల్‌ శ్రద్ధగా నేర్చుకున్నట్టు వీడియో చూస్తే అర్థమవుతోంది. ఈ చిత్రం కోసం ప్రత్యేకమైన ఖడ్గాన్ని తయారు చేశారు. శత్రువులను దాంతో ఎలా సంహరించాలో నాగ్‌ ట్రైనింగ్‌ తీసుకున్న దృశ్యాలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. కథలో ఆ కత్తి ప్రత్యేకంగా నిలవబోతుందని టాక్‌. మరి ఆ ఖడ్గం స్పెషల్‌ ఏంటో, ‘ది ఘోస్ట్‌’ ఆపరేషన్‌ ఏంటో తెలియాంటే సినిమా చూడాల్సిందే.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని