The Ghost: ‘ది ఘోస్ట్‌’ హవా.. హిందీలో నంబరు 1.. తెలుగులో నంబరు 4

‘ది ఘోస్ట్‌’ అత్యధిక వీక్షణలతో హవా కొనసాగిస్తోంది. నాగార్జున హీరోగా తెరకెక్కిన ఈ సినిమా డ్రెండింగ్‌లో రెండు స్థానాలను కైవసం చేసుకొంది.

Published : 10 Nov 2022 14:04 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నాగార్జున (Nagarjuna Akkineni) హీరోగా తెరకెక్కిన ‘ది ఘోస్ట్‌’ (The Ghost) సినిమా ఓటీటీలోనూ హవా కొనసాగిస్తోంది. అత్యధిక వీక్షణలు సొంతం చేసుకొని సత్తా చాటింది. థియేటర్లలో అక్టోబరు 5న విడుదలైన ఈ చిత్రం ఈ నెల 2 నుంచి ‘నెట్‌ఫ్లిక్స్‌’ (Netflix)లో స్ట్రీమింగ్‌ అవుతోంది. ఈ వారంలో ఓటీటీలో అత్యధికమంది చూసిన చిత్రంగా ‘ది ఘోస్ట్‌’ నిలిచింది. ఈ సినిమా హిందీ వెర్షన్‌ తొలి స్థానాన్ని కైవసం చేసుకోగా తెలుగు వెర్షన్‌ నాలుగో స్థానాన్ని దక్కించుకుంది. రెండు భాషల్లో ట్రెండింగ్‌లో ఉండటంతో చిత్ర బృందం సోషల్‌ మీడియా వేదికగా హర్షం వ్యక్తం చేసింది.

ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రంలో ఇంటర్‌పోల్‌ అధికారి విక్రమ్‌ పాత్రలో నాగార్జున కనిపించారు. విలన్ల నుంచి ముప్పు పొంచి ఉన్న తల్లీకూతుళ్లను కాపాడే క్రమంలో విక్రమ్‌కు ఎటువంటి అనుభవాలు ఎదురయ్యాయి? విక్రమ్‌ ప్రయత్నం ఫలించిందా? వారికి, విక్రమ్‌కు ఉన్న సంబంధమేంటి? అనే కథాంశంతో ఈ చిత్రాన్ని దర్శకుడు ప్రవీణ్‌ సత్తారు తెరకెక్కించారు. ఇందులోని యాక్షన్‌ సీక్వెన్స్‌ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు