The Ghost: పవర్‌ఫుల్‌గా ‘ది ఘోస్ట్‌’ రిలీజ్‌ ట్రైలర్‌.. నాగార్జున యాక్షన్‌కు వావ్‌ అనాల్సిందే!

నాగార్జున హీరోగా నటించిన ‘ది ఘోస్ట్‌’ రిలీజ్‌ ట్రైలర్‌ విడుదలైంది. ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వం వహించిన ఈ సినిమా దసరా కానుకగా అక్టోబరు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Updated : 30 Sep 2022 16:24 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) హీరోగా దర్శకుడు ప్రవీణ్‌ సత్తారు తెరకెక్కించిన చిత్రం ‘ది ఘోస్ట్‌’ (The Ghost). సోనాల్‌ చౌహాన్‌ కథానాయిక. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబరు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల సమయం సమీపిస్తుండటంతో చిత్ర బృందం ప్రచారాన్ని జోరుగా కొనసాగిస్తోంది. ఇప్పటికే టీజర్‌, ట్రైలర్‌, పాటలు విడుదల చేసిన చిత్ర బృందం తాజాగా ‘రిలీజ్‌ ట్రైలర్‌’ను అభిమానులతో పంచుకుంది. యాక్షన్‌ ప్రధానంగా సాగే ఈ ట్రైలర్‌ ఆద్యంతం ఆకట్టుకుంది. ఈ కొత్త ట్రైలర్‌లోని సన్నివేశాలు సినిమాలో కీలకంగా నిలిచేవని అర్థమవుతోంది. ‘డబ్బు, సక్సెస్‌.. సంతోషం కంటే శత్రువులను ఎక్కువ సంపాదిస్తుంది’ అనే డైలాగ్‌ అందరినీ మెప్పించేలా ఉంది. మరి, ఇంటర్‌పోల్‌ అధికారులైన హీరో-హీరోయిన్లు తమ ఆపరేషన్‌ పూర్తి చేశారా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని