The Ghost: ‘ది ఘోస్ట్‌’.. చూపు తిప్పుకోనివ్వదు..

‘‘ఫ్యామిలీ ఎమోషన్స్‌తో నిండి ఉన్న పూర్తిస్థాయి మాస్‌ చిత్రం ‘ది ఘోస్ట్‌’’ అన్నారు సునీల్‌ నారంగ్‌, పుస్కూర్‌ రామ్‌మోహన్‌రావు. శరత్‌ మరార్‌తో కలిసి వీరు నిర్మించిన చిత్రమే ‘ది ఘోస్ట్‌’. నాగార్జున కథానాయకుడిగా నటించారు. ప్రవీణ్‌ సత్తారు దర్శకుడు.

Updated : 04 Oct 2022 11:56 IST

‘‘ఫ్యామిలీ ఎమోషన్స్‌తో నిండి ఉన్న పూర్తిస్థాయి మాస్‌ చిత్రం ‘ది ఘోస్ట్‌’’ (The Ghost) అన్నారు సునీల్‌ నారంగ్‌, పుస్కూర్‌ రామ్‌మోహన్‌రావు. శరత్‌ మరార్‌తో కలిసి వీరు నిర్మించిన చిత్రమే ‘ది ఘోస్ట్‌’. నాగార్జున (Nagarjuna) కథానాయకుడిగా నటించారు. ప్రవీణ్‌ సత్తారు దర్శకుడు. సోనాల్‌ చౌహాన్‌ కథానాయిక. ఈనెల 5న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సోమవారం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మాతలు సునీల్‌ నారంగ్‌, రామ్‌మోహన్‌రావు మాట్లాడుతూ.. ‘‘దర్శకుడు సినిమాని చాలా స్టైలిష్‌గా తెరకెక్కించారు. ఇందులో నాగార్జున మునుపెన్నడూ చూడని విధంగా సరికొత్త యాక్షన్‌ లుక్‌లో కనిపిస్తారు. తెర మీద నుంచి ఒక్క సెకను కూడా చూపు తిప్పుకోలేరు. కచ్చితంగా మంచి ఓపెనింగ్స్‌ వస్తాయని భావిస్తున్నాం’’ అన్నారు. అనంతరం ‘ప్రిన్స్‌’ చిత్రాన్ని అక్టోబర్‌ 21న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం సందీప్‌ కిషన్‌, సుధీర్‌బాబుతో సినిమాలు చేస్తున్నట్లు తెలియజేశారు.


చిత్రబృందం చెన్నైలో సందడి

‘ది ఘోస్ట్‌’ తెలుగుతోపాటు తమిళంలోనూ ఇదే పేరుతో విడుదలవుతోంది. ప్రచార కార్యక్రమాల్లో భాగంగా చిత్రబృందం సోమవారం చెన్నైలో పర్యటించింది. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ.. ‘చెన్నైతో నాకు విడదీయరాని అనుబంధం ఉంది. నా తమిళ చిత్రాలు ‘ఉదయం’, ‘రక్షగన్‌’, ‘గీతాంజలి’లకు ఇక్కడ మంచి ఆదరణ దక్కింది. అదేవిధంగా ‘ఘోస్ట్‌’ విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. ఈ సినిమా కోసం తమిళంలో డబ్బింగ్‌ చెప్పా. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే దర్శకుల్లో ప్రవీణ్‌ ఒకరు. ఆ విషయం చిత్రం విడుదలైన తర్వాత మీకు తెలుస్తుంది’ అన్నారు. కార్యక్రమంలో సోనాల్‌ చౌహాన్‌ తదితరులు పాల్గొన్నారు.

- న్యూస్‌టుడే, కోడంబాక్కం


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని