Updated : 19 Aug 2022 07:07 IST

The Ghost: దసరా బరిలో ‘ది ఘోస్ట్‌’

తమహగనే అంటే ఏమిటి? అనే ప్రశ్నని సామాజిక మాధ్యమాల ద్వారా సంధించి కొన్నాళ్లుగా ఊరిస్తూ వచ్చింది ‘ది ఘోస్ట్‌’ (Th Ghost) బృందం. ఎట్టకేలకి ఆ ప్రశ్నకి సమాధానాన్ని ఓ వీడియో రూపంలో వెల్లడించాయి సినీ వర్గాలు. జపనీస్‌ సంప్రదాయంలో తయారు చేసిన ఓ రకమైన లోహాన్ని తమహగనే అంటారట. ఆ లోహంతోనే నాగార్జున ఓ ఖడ్గాన్ని తయారు చేసి శత్రువులపై దూసేందుకు సన్నద్ధమవుతాడు. ఈ కత్తి గురించి మరిన్ని వివరాలు ఈ నెల 25న విడుదల కానున్న ట్రైలర్‌తో తెలియనుంది. నాగార్జున కథానాయకుడిగా ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ది ఘోస్ట్‌’. సోనాల్‌ చౌహాన్‌ కథానాయిక. నారాయణ్‌దాస్‌ నారంగ్, సునీల్‌ నారంగ్, పుస్కూర్‌ రామ్మోహన్‌రావు, శరత్‌ మరార్‌ నిర్మిస్తున్నారు. దసరా సందర్భంగా అక్టోబర్‌ 5న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు గురువారం వెల్లడించింది చిత్రబృందం. ఈ కథలో తమహగనేతో తయారు చేసిన ఖడ్గానికి ప్రాధాన్యం ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే గురువారం ఆ ఖడ్గం వివరాల్ని, ప్రాముఖ్యతని వెల్లడిస్తూ, రాజు చేతిలో గర్వంగా ఖడ్గం అనే వ్యాఖ్యతో వీడియోని విడుదల చేశారు. సంగీతం: మార్క్‌ కె.రాబిన్, భరత్, సౌరభ్, ఛాయాగ్రహణం: ముఖేష్‌. 


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని