The Gray Man: ‘ది గ్రే మ్యాన్‌’ ఎప్పుడంటే?

తన సహజమైన  నటనతో దేశవ్యాప్తంగా అభిమానులను  సంపాదించుకున్న నటుడు ధనుష్‌. ప్రస్తుతం తొలిసారిగా హాలీవుడ్‌లో ‘ది గ్రే మ్యాన్‌’ లో నటిస్తున్న విషయం తెలిసిందే. రుసో బ్రదర్స్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న నెట్‌ఫ్లిక్స్‌

Updated : 29 Apr 2022 13:53 IST

న సహజమైన  నటనతో దేశవ్యాప్తంగా అభిమానులను  సంపాదించుకున్న నటుడు ధనుష్‌. ప్రస్తుతం తొలిసారిగా హాలీవుడ్‌లో ‘ది గ్రే మ్యాన్‌’ లో నటిస్తున్న విషయం తెలిసిందే. రుసో బ్రదర్స్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న నెట్‌ఫ్లిక్స్‌ తాజాగా ధనుష్‌ ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేసింది. ఓ పోరాట సన్నివేశంలో భాగంగా కారు మీద ఉన్న ధనుష్‌ మంచి యాక్షన్‌ మూడ్‌లో ఉన్నట్లు ప్రచార చిత్రం ఉంది. మార్క్‌ గ్రీనీ రచించిన ‘ది గ్రే మ్యాన్‌’ నవల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ర్యాన్‌ గోస్లింగ్‌, క్రిస్‌ ఏవన్స్‌, జెసికా హెన్‌విక్‌ తదితరులు నటించారు. యాక్షన్‌ థ్రిల్లర్‌గా రానున్న ఈ సినిమా జులై 22న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని