ధనుష్‌ ‘ది గ్రే మ్యాన్‌’

దక్షణాది తారలు హాలీవుడ్, బాలీవుడ్‌ సినిమాల్లో అతిథులుగా మెరవడం అరుదుగా కన్పిస్తుంటుంది. అలాంటిది తమిళ నటుడు ధనుష్‌ ఏకంగా హాలీవుడ్‌ సినిమాలో ముఖ్యపాత్ర దక్కించుకున్న విషయం తెలిసిందే.

Published : 18 Mar 2021 10:06 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దక్షణాది తారలు హాలీవుడ్, బాలీవుడ్‌ సినిమాల్లో అతిథులుగా మెరవడం అరుదుగా కన్పిస్తుంటుంది. అలాంటిది తమిళ నటుడు ధనుష్‌ ఏకంగా హాలీవుడ్‌ సినిమాలో ముఖ్యపాత్ర దక్కించుకున్న విషయం తెలిసిందే. ఆయన నటిస్తున్న ‘ది గ్రే మ్యాన్‌’ చిత్రీకరణ బుధవారం ప్రారంభమైంది. ఈ సినిమా గతేడాది సెట్స్‌పైకి వెళ్లాల్సింది. కరోనా, లాక్‌డౌన్‌ పరిస్థితులతో ఆలస్యంగా ప్రారంభమైంది. దర్శకద్వయం రూసో బ్రదర్స్‌ రూపొందిస్తున్న ఈ చిత్రంలో ధనుష్‌తో పాటు ఛారీస్‌ ఎవన్స్, రేయాన్‌ గోస్లింగ్‌ ప్రధాన పాత్రల్లో కన్పించనున్నారు. ఈ విషయాన్ని రూసో బ్రదర్స్‌ తమ సామాజిక మాధ్యమాల ద్వారా ప్రకటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని