Dhanush: ధనుష్‌ పోరాటం..విక్కీ కౌశల్‌ ప్రచారం

ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ నిర్మాణ భాగస్వామ్యంతో, రూసోబ్రదర్స్‌ దర్శకత్వం వహించిన హాలీవుడ్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘ది గ్రే మ్యాన్‌’(The Gray Man). ర్యాన్‌ గాస్లింగ్‌ (Ryan Gosling) కథానాయకుడిగా నటించిన ఈ చిత్రంలో కోలీవుడ్‌ నటుడు ‘ధనుష్‌’ (Dhanush)...

Published : 19 Jul 2022 19:07 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ నిర్మాణ భాగస్వామ్యంతో, రూసోబ్రదర్స్‌ దర్శకత్వం వహించిన హాలీవుడ్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘ది గ్రే మ్యాన్‌’(The Gray Man). ర్యాన్‌ గాస్లింగ్‌ (Ryan Gosling) కథానాయకుడిగా నటించిన ఈ చిత్రంలో కోలీవుడ్‌ నటుడు ‘ధనుష్‌’ (Dhanush) కీలకపాత్ర పోషించాడు. ‘అవిక్‌ సాన్‌’ పేరుతో ఈ సినిమాలో ధనుష్‌ చేసిన పోరాటాలు ప్రచార చిత్రాల్లో కనిపించి, ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ నెల 15న థియేటర్లలో విడుదలైనా ఈ చిత్రానికి మంచి స్పందన లభిస్తోంది. సీఐఏ ఏజెంట్ల ఆపరేషన్‌లో భాగంగా నడిచే కథకు, ఉత్కంఠ కలిగించే యాక్షన్‌ సన్నివేశాలకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నట్లు, అందుకే ఈ సినిమాను నెట్‌ఫ్లిక్స్‌లో ఈ నెల 22నుంచే స్ట్రీమింగ్‌ చేయనున్నట్లు ఓటీటీ సంస్థ ప్రకటించింది. ఇంకా ఈ సినిమా ప్రచారానికి ప్రముఖ బాలీవుడ్‌ నటుడు విక్కీకౌశల్‌ ను ఎంచుకున్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా విక్కీ కౌశల్‌ తో ఒక ప్రత్యేక ప్రచార వీడియోను చిత్రీకరించి యూట్యూబ్‌లో ఉంచింది. ఇక ‘ది గ్రే మ్యాన్‌’ చిత్రంలో ‘కెప్టెన్‌ అమెరికా’ ఫేం క్రిస్‌ ఇవాన్స్‌(Chris Evans) ముఖ్య పాత్ర పోషించాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని