Kiara Advani: ఎన్నో నేర్పింది పదేళ్ల ప్రయాణం

‘‘కుటుంబంతో కలిసి చూసే సినిమాల్లో నటించడమే నా లక్ష్యం’’ అని అంటోంది బాలీవుడ్‌ భామ కియారా అడ్వాణీ. ‘ఫగ్లీ’తో బాలీవుడ్‌లోకి అడుగు పెట్టిన ఈ అందాల తార.

Updated : 18 Jun 2024 03:41 IST

‘‘కుటుంబంతో కలిసి చూసే సినిమాల్లో నటించడమే నా లక్ష్యం’’ అని అంటోంది బాలీవుడ్‌ భామ కియారా అడ్వాణీ. ‘ఫగ్లీ’తో బాలీవుడ్‌లోకి అడుగు పెట్టిన ఈ అందాల తార.. తన నటనతో తెలుగు ప్రేక్షకులనూ మెప్పించింది. త్వరలో ‘గేమ్‌ఛేంజర్‌’తో రావడానికి సిద్ధమవుతున్న కియార.. హిందీ పరిశ్రమలో పదేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా తన అనుభవాలను పంచుకుంటూ ఇన్‌స్టా వేదికగా ఓ పోస్ట్‌ పెట్టింది. ‘‘నటిగా ఎదగాలనే లక్ష్యంతో నాకు 21ఏళ్లు ఉన్నప్పుడు సినీ కెరీర్‌ను ప్రారంభించాను. అప్పుడు నేనేం చేస్తున్నానో.. ప్రేక్షకులకు ఎలా దగ్గరవ్వాలో కూడా తెలియదు. ఎలాంటి సినిమాలు ఎంచుకోవాలో అవగాహన లేదు. కానీ నా పదేళ్ల ప్రయాణంలో జీవితంలో ఎలా పైకి ఎదగాలో నేర్చుకున్నాను. పాత్రలు, కథల ఎంపికలో మార్పులు చేస్తూ.. కుటుంబంతో కలిసి చూసేలా సినిమాలు తీయాలని నిర్ణయించుకున్నాను. ఇప్పుడిదే నా లక్ష్యం. ఈ ప్రయాణంలో ఎన్నో మరువలేని జ్ఞాపకాలను పోగుచేసుకున్నాను. ఇప్పటికీ రోజూ కొత్తగానే అనిపిస్తుంటుంది. ప్రేమ, కలలు, చిరునవ్వులు, కన్నీళ్లు.. ఇలా ఎన్నో అనుభవాలను ఎదుర్కొన్నాను. నా లక్ష్యాన్ని సాధించడానికి సహకరించిన దర్శకులకు, సహనటులకు, అభిమానులకు కృతజ్ఞతలు’’ అని చెప్పుకొచ్చింది కియార.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని