The Kashmir Files: ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ ఓటీటీ రిలీజ్‌ ఫిక్స్‌.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

చిన్న సినిమాగా విడుదలై, ఊహించనంత పెద్ద విజయం అందుకుంది ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’. 30 ఏళ్ల క్రితం కశ్మీరీ పండిట్‌లు పడిన బాధలను  కళ్లకు కట్టినట్టు చూపించిన ఈ చిత్రం ఓ సంచలనమైంది.

Published : 25 Apr 2022 15:07 IST

ఇంటర్నెట్‌ డెస్క్: చిన్న సినిమాగా విడుదలై, ఊహించనంత పెద్ద విజయం అందుకుంది ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’. 30 ఏళ్ల క్రితం కశ్మీరీ పండితులు పడిన బాధలను కళ్లకు కట్టినట్టు చూపించిన ఈ చిత్రం ఓ సంచలనమైన సంగతి తెలిసిందే. విమర్శకుల ప్రశంసలతోపాటు వసూళ్లను రికార్డు స్థాయిలో రాబట్టింది. అలాంటి ఈ సినిమాను మళ్లీ మళ్లీ చూసేందుకు ఓటీటీలోకి ఎప్పుడొస్తుందా? అని ఆసక్తిగా ఎదురుచూసిన అభిమానులకు చిత్ర బృందం శుభవార్తను వినిపించింది. మే 13 నుంచి ఈ సినిమా ‘జీ 5’లో స్ట్రీమింగ్‌ అవుతుందని ప్రకటించింది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో అందుబాటులో ఉంటుందని తెలిపింది. అనుపమ్‌ ఖేర్‌, మిథున్‌ చక్రవర్తి, దర్శన్‌ కుమార్‌, పల్లవి జోషి తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకు వివేక్‌ అగ్నిహోత్రి దర్శకత్వం వహించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని